ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చరిత్ర’ దిశగా మధ్యప్రదేశ్‌

ABN, First Publish Date - 2022-06-26T10:10:58+05:30

తొలి రంజీ టైటిల్‌తో చరిత్ర సృష్టించే దిశగా మధ్యప్రదేశ్‌ (ఎంపీ) అడుగులు వేస్తోంది. రజత్‌ పటీదార్‌ (122) సెంచరీతో.. ముంబైతో రంజీ ఫైనల్‌ తొలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 162 పరుగులు

ముంబై 113/2 

రంజీ ట్రోఫీ ఫైనల్‌


బెంగళూరు: తొలి రంజీ టైటిల్‌తో చరిత్ర సృష్టించే దిశగా మధ్యప్రదేశ్‌ (ఎంపీ) అడుగులు వేస్తోంది. రజత్‌ పటీదార్‌ (122) సెంచరీతో.. ముంబైతో రంజీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎంపీ కీలకమైన 162 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. టీ బ్రేక్‌కు ముందు ఆటకు.. వర్షం కొంతసేపు ఆటం కం కలిగించింది. ఆఖరి, ఐదోరోజు ఆట మాత్రమే మిగిలున్న నేపథ్యంలో మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువ. ఇదే జరిగితే మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా మధ్యప్రదేశ్‌ టైటిల్‌ చేజిక్కించుకుంటుంది.


ఓవర్‌నైట్‌ స్కోరు 368/3తో ఆటకు నాలుగో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఎంపీ 536 పరుగులకు ఆలౌటైంది. సారాంశ్‌ జైన్‌ (57) అర్ధ శతకం సాధించాడు. శామ్స్‌ ములాని 5, తుషార్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఆటముగిసే సరికి 113/2 స్కోరు చేసింది. అర్మాన్‌ జాఫర్‌ (30), సువేద్‌ పార్కర్‌ (9) క్రీజులో ఉన్నారు. మొత్తంగా ఎంపీ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ముంబై 49 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 374 రన్స్‌ చేసింది. 

Updated Date - 2022-06-26T10:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising