ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేవరెట్‌ సింధు

ABN, First Publish Date - 2022-01-18T10:17:17+05:30

గతవారం ఇండియా ఓపెన్‌ సెమీ్‌సలోనే నిష్క్రమించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అంతలోనే మరో టోర్నీకి సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ నేటినుంచే

లఖ్‌నవూ: గతవారం ఇండియా ఓపెన్‌ సెమీ్‌సలోనే నిష్క్రమించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అంతలోనే మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుంచి ఇక్కడ జరిగే సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత సింధు మరో టైటిల్‌ నెగ్గలేదు. దీంతో సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలోనైనా విజేతగా నిలిచి టైటిల్‌ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదలతో ఉంది. తొలిరౌండ్లో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌తో సింధు తలపడనుంది. సింధు, సుపనిదతో పాటు రెండోసీడ్‌ మిచెల్లీ లీ కూడా టైటిల్‌ రేసులో ఉంది. మరో భారత ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌.. చెక్‌ షట్లర్‌ తెరెజా స్వబికోవాతో ఆరంభరౌండ్‌ ఆడనుంది.  


వైదొలగిన లక్ష్యసేన్‌, సాత్విక్‌-చిరాగ్‌:

సయ్యద్‌ మోదీ టోర్నీ పురుషుల విభాగం నుంచి భారత స్టార్లలో కొందరు బరిలోకి దిగడం లేదు. ఇండియా ఓపెన్‌ సింగిల్స్‌ విజేతగా నిలిచిన లక్ష్యసేన్‌ విశ్రాంతి కారణంగా ఈ టోర్నీలో ఆడడం లేదు. ఇండియా ఓపెన్‌ డబుల్స్‌ చాంపియన్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ కూడా విశ్రాంతి కోసం సయ్యద్‌ టోర్నీలో తలపడడం లేదు. కరోనాతో ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలగిన టాప్‌సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ కూడా క్వారంటైన్‌ నిబంధనలతో తాజా టోర్నీకి దూరమయ్యాడు.   

Updated Date - 2022-01-18T10:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising