ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే.. రోహిత్ ఉండాలంటున్న అభిమానులు

ABN, First Publish Date - 2022-06-11T02:14:55+05:30

భారత్‌ క్రికెట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పగ్గాలు వదిలేసిన తర్వాత.. రోహిత్‌ శర్మ ఆ బాధ్యతలను తీసుకున్నారు. అప్పటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పగ్గాలు వదిలేసిన తర్వాత.. రోహిత్‌ శర్మ ఆ బాధ్యతలను తీసుకున్నారు. అప్పటి నుంచి టీమిండియాకు ఎదురులేని విజయాలను అందిస్తున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం రోహిత్ లేకుండా భారత్‌ ఆడిన మ్యాచుల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. దీంతో అభిమానులంతా ఇకపై ఆడే ప్రతి మ్యాచులోనూ రోహిత్‌ శర్మ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. 


2022లో ఇప్పటివరకు టీమిండియా 17 మ్యాచులు ఆడింది. అందులో రోహిత్ శర్మ ఉన్న 11 మ్యాచుల్లోనూ ఎదురు లేని విజయాలు సాధించింది. కానీ రోహిత్‌ లేని ఆ ఆరు మ్యాచులు మాత్రం ఓడిపోయింది. ఈ ఏడాది తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన భారత్.. ఓటమి పాలైంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కేప్ టౌన్ వేదికగా ఆడిన మరో టెస్టులోనూ టీమిండియా ఓడిపోయింది. తరువాత వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కేఎల్‌ రాహుల్.. వన్డే సిరీస్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. సఫారీ గడ్డపై మూడు వన్డేల్లోనూ భారత్‌ క్లీన్‌ స్వీప్‌ అయింది. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచుల్లో భారత్‌ క్లీన్‌ స్వీప్ చేసింది. రోహిత్ కెప్టెన్సీలో 11 మ్యాచులు ఆడగా.. పదకొండింటిలోనూ విజయం సాధించింది.


ఆ తర్వాత ఐపీఎల్‌ సీజన్‌ మొదలైంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ 20 సిరీస్‌ నుంచి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో జట్టు పగ్గాలు రిషబ్‌ పంత్‌కు దక్కాయి. పంత్‌ కెప్టెన్సీలో ఆడిన తొలి టీ20 కూడా టీమిండియా ఓటమి పాలైంది. దీంతో అభిమానులంతా టీమిండియా తర్వాతి మ్యాచులన్నింటిలోనూ రోహిత్ శర్మ ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-06-11T02:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising