ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమ కుమారుడి పేరును ప్రపంచానికి వెల్లడించిన Yuvraj Singh దంపతులు

ABN, First Publish Date - 2022-06-20T02:38:01+05:30

భారత జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh), బ్రిటిష్ నటి, మోడల్ అయిన హేజల్ కీచ్ (Hazel Keech)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు 2016లో వివాహమడారు. ఈ జంటకు 2022

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh), బ్రిటిష్ నటి, మోడల్ అయిన హేజల్ కీచ్ (Hazel Keech)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు 2016లో వివాహమడారు. ఈ జంటకు 2022 ప్రారంభంలో పండంటి మగ బిడ్డ పుట్టాడు. ఈ దంపతులు గతంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. కానీ, ఈ జంట తమ కుమారుడి ఫొటోను ఎప్పుడు ప్రపంచానికి చూపించలేదు. ఈ జంట ఫాదర్స్ డే సందర్భంగా తమ కొడుకు ఫొటోను అందరికి చూపిస్తూ పేరును కూడా వెల్లడించారు. 


యువరాజ్ సింగ్, హేజల్ కీచ్ దంపతులు తమ కుమారుడికి ఓరియన్  కీచ్ సింగ్(Orion Keech Singh)అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సంబంధించిన రెండు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ పిక్స్ కింద కామెంట్ కూడా చేశారు. ‘‘ఈ ప్రపంచంలోకి  ఓరియన్ కీచ్ సింగ్‌‌కు స్వాగతం. అమ్మ, నాన్నలు తమ కుమారుడిపై ప్రేమను కురిపించేందుకు సిద్దంగా ఉన్నారు’’ అని యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఆయన అడుగు పెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి ఆల్ రౌండ‌ర్‌గా ఎదిగారు. యువరాజ్ సింగ్ భారత్ జట్టుకు దాదాపుగా 19ఏళ్లు ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌ల నుంచి 2019, జూన్ 10న ఆయన రిటైర్ మెంట్ ప్రకటించారు. భారత్ తరఫున యువీ 304వన్డేలు, 40టెస్ట్‌లు, 58టీ20 ఆడారు. 



Updated Date - 2022-06-20T02:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising