ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

245 పరుగుల వద్ద ముగిసిన భారత్ రెండో ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ ఎదుట కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2022-07-05T00:24:34+05:30

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ముగిసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ (Team India) రెండో ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుంటే భారత్ ఆధిక్యం 377 పరుగులకు చేరింది.  ఓవర్‌నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 120 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన బ్యాటర్లు వరుసపెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. నేటి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ (Rishabh Pant) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం మినహా చెప్పుకోదగ్గ స్కోరు లేదు.


పుజారా 66 పరుగులు చేసి అవుట్ కాగా, పంత్ 57 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 19, రవీంద్ర జడేజా 23, షమీ 13 పరుగులు చేశాడు.  ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్‌కు 4 వికెట్లు దక్కగా బ్రాడ్, పాట్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రాలీ 10, అలెక్స్ లీస్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-07-05T00:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising