ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్నింగ్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ చిత్తు

ABN, First Publish Date - 2022-08-20T10:50:23+05:30

రెండు దశాబ్దాలుగా ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు ఓటమనేదే లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం

లండన్‌: రెండు దశాబ్దాలుగా ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు ఓటమనేదే లేదు. కానీ దక్షిణాఫ్రికా ధాటి కి ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో ఘోరపరాజయం తప్పలేదు. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్లు అదరగొట్టారు. 2003 తర్వాత లార్డ్స్‌లో ఇంగ్లండ్‌కిదే తొలి ఓటమి. దీంతో 3 టెస్టుల సిరీ్‌సలో ప్రొటీస్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 37.4 ఓవర్లు మాత్రమే క్రీజులో నిలిచింది.


రెండోరోజైన శుక్రవారం దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 326 రన్స్‌ వద్ద ముగించింది. బ్రాడ్‌, స్టోక్స్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 149 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ లీస్‌ (35), బ్రాడ్‌ (35) మాత్రమే రాణించారు. లంచ్‌ సెషన్‌లో నోకియా 10 బంతుల వ్యవధిలోనే 3 వికెట్లు తీశాడు. రబాడ, కేశవ్‌, జాన్సెన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 165 రన్స్‌కు ఆలౌటైంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రబాడ నిలిచాడు.

Updated Date - 2022-08-20T10:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising