ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అండర్-19 ప్రపంచ‌కప్ ఫైనల్: దుమ్మురేపుతున్న భారత బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్

ABN, First Publish Date - 2022-02-06T01:32:32+05:30

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో భారత కుర్రాళ్లు దుమ్ము రేపుతున్నారు. భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంటిగ్వా: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో భారత కుర్రాళ్లు దుమ్ము రేపుతున్నారు. భారత బౌలర్లు రాజ్ బవా, రవి కుమార్ దెబ్బకు ఇంగ్లండ్ వికెట్లు టపటపా రాలుతున్నాయి. 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు కలిసి రాలేదు. నాలుగు పరుగుల వద్దే ఓపెనర్  జాకోబ్ బెథెల్  (2)ను రవికుమార్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టామ్ ప్రెస్ట్ నాలుగు బంతులు ఆడి రవికుమార్ బౌలింగులో డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జార్జ్ థామస్ మాత్రం క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యాడు. 27 పరుగులు మాత్రమే చేసి రాజ్ బవాకు చిక్కాడు. 


వరుసగా వికెట్లు కోల్పోతున్న ఇంగ్లండ్ ఒత్తిడిలోకి వెళ్లిపోగా రాజ్ బవా మరింతగా విజృంభించాడు. విలియమ్ లక్స్‌టన్ (4), జార్జ్‌బెల్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రెహన్ అహ్మద్ (10) కూడా రాజ్ బవాకే చిక్కాడు. దీంతో అతడి ఖాతాలో నాలుగు వికెట్లు చేరాయి. 17 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

Updated Date - 2022-02-06T01:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising