ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli ని ట్రోల్ చేసిన ఇంగ్లండ్ క్రికెట్.. ట్విటర్‌లో..

ABN, First Publish Date - 2022-07-06T22:35:20+05:30

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు(Edgebaston Test)లో టీమిండియా(Team India) అనూహ్యంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్ : ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు(Edgebaston Test)లో టీమిండియా(Team India) అనూహ్యంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో(Johny Bairstow), జో రూట్(Joe Root) భాగస్వామ్యం సునాయాసంగా మార్చివేసింది. ఇద్దరూ భారీ శతకాలతో చెలరేగడంతో  భారత్‌(India)కి ఓటమి తప్పలేదు. ఫలితంగా ఇంగ్లండ్‌లో చరిత్రాత్మక విజయాన్ని చేజిక్కించుకోవడం విఫలమైంది. మ్యాచ్‌ మొదటి 3 రోజులూ భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా ఓడిపోవడం ఇండియన్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. 


కాగా మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని ట్రోల్(Troll) చేస్తూ ‘ఇంగ్లండ్ క్రికెట్’(England Cricket) ఓ ట్వీట్ చేసింది. బెయిర్‌స్టో, విరాట్ కోహ్లీల మధ్య మాటల యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. 2 ఫొటోలను జతచేసి ఓ పోస్ట్ పెట్టింది. మొదటి ఫొటోలో విరాట్ కోహ్లీ తన నోటిపై వేలేసుకుని ‘సైలెంట్‌గా ఉండు’ అని హెచ్చరిస్తున్నట్టు ఉంది. ఈ ఫ్రేమ్‌లో జానీ బెయిర్‌స్టో కూడా ఉన్నాడు. ఇక రెండో ఫొటోలో.. ఇంగ్లండ్ గెలుపు తర్వాత బెయిర్‌స్టోని విరాట్ కోహ్లీ ఆలింగనం చేసుకున్నాడు. 


ఈ ఫొటోల వెనుక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. టెస్టు మ్యాచ్ మూడవ రోజున విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం జరిగింది. తొలుత విరాట్ కోహ్లీ బెయిర్‌స్టో వైపు నడుచుకుంటూ వచ్చి.. క్రీజులో ఉండాలంటూ వేలు చూపిస్తూ సంకేతమిచ్చాడు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండాలంటూ సంజ్ఞ చేయడం కెమెరాల్లో కూడా రికార్డయ్యింది. కాగా క్రీజులోనే ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్.. విరాట్ కోహ్లీతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో కోహ్లీ వెళ్లి బెయిర్‌స్టోని చూస్తూ స్నేహపూర్వక అర్థానిచ్చేలా నవ్వాడు. కాగా ఇవన్నీ మైండ్‌గేమ్‌లో భాగం. బెయిర్‌స్టోపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 114 పరులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోహ్లీకి బెయిర్‌స్టో బ్యాటింగ్‌తో రూపంలో సమాధానమిచ్చాడనే అర్థంలో ఇంగ్లండ్ ఈ ట్వీట్ చేసింది.



Updated Date - 2022-07-06T22:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising