ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs ENG: రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..

ABN, First Publish Date - 2022-07-15T03:05:12+05:30

లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న టీమిండియా, ఇంగ్లండ్ రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లార్డ్స్: లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న టీమిండియా, ఇంగ్లండ్ రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి తొలి వికెట్ కోల్పోయింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాసన్ రాయ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టో 38 పరుగులకు, రూట్ కూడా 11 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ 4 పరుగులకే షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ 21 పరుగులు, లియామ్ లివింగ్‌స్టోన్ 33 పరుగులు చేసి ఔట్ కావడంతో ఇంగ్లండ్ 150 పరుగుల లోపే ఆరు కీలక వికెట్లను కోల్పోయింది.



అయితే.. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, మరో ఆటగాడు డేవిడ్ విల్లీ నిలకడగా ఆడి జట్టు పరువు నిలిపే ప్రయత్నం చేశారు. మొయిన్ అలీ 47 పరుగులు, విల్లీ 41 పరుగులు చేశారు. ఓవర్‌టన్ 10 పరుగులు, కార్స్ 2, టోప్లే 3 పరుగులు చేశారు. దీంతో.. ఇంగ్లండ్ జట్టు 49 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో స్పిన్నర్ చాహల్ 4 వికెట్లతో రాణించాడు. బుమ్రా, హార్థిక్ పాండ్యాకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ప్రసీద్ కృష్ణ, షమీకి చెరో వికెట్ దక్కింది. 247 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగనుంది. రోహిత్ శర్మ, ధావన్ తొలి వన్డేలో రాణించడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

Updated Date - 2022-07-15T03:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising