ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ ద్రవిడ్‌పై వృద్ధిమాన్ సాహా సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-02-20T23:15:43+05:30

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం శనివారం ప్రకటించిన భారత జట్టులో వృద్ధిమాన్ సాహా పేరు కనిపించలేదు. టెస్టు జట్టు నుంచి తనను తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సాహా ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు. జట్టు ఎంపికలో ఇకపై తన పేరును పరిగణనలోకి తీసుకోబోమని రాహుల్ ద్రవిడ్ తనతో చెప్పారని, అంతేకాకుండా రిటైర్మెంట్ ప్రకటించమని సలహా కూడా ఇచ్చారని పేర్కొన్నాడు. 


జట్టును ఎంపిక చేసే సమయంలో ఇకపై తన పేరును పరిగణనలోకి తీసుకోబోమని మేనేజ్‌మెంట్ తనకు చెప్పిందని, అయితే తాను భారత జట్టులో సభ్యుడిని కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటపెట్టలేదని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ కూడా అదే విషయం చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు, బీసీసీఐ బాస్ గంగూలీపైనా తీవ్ర విమర్శల చేశాడు. గతేడాది నవంబరులో న్యూజిలాండ్‌తో కాన్పూరులో జరిగిన తొలి టెస్టులో గాయంతో బాధపడుతూనే అజేయంగా 61 పరుగులు సాధించినట్టు సాహా పేర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత గంగూలీ తనను అభినందిస్తూ వాట్సాప్ చేశాడని వివరించాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు జట్టులో స్థానం కోసం ఎలాంటి ఆందోళన వద్దని చెప్పాడని గుర్తు చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడిని అలాంటి మెసేజ్ రావడంతో తాను చాలా సంతోషించానన్నాడు. అయితే, పరిస్థితులు ఇంత వేగంగా ఎందుకు మారిపోతున్నాయో అర్ధం చేసుకోవడంలో తాను విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-02-20T23:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising