ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొకోవిచ్‌ అవుట్‌

ABN, First Publish Date - 2022-01-17T08:41:27+05:30

జొకోవిచ్‌ అవుట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసీస్‌ను వీడిన సెర్బియా స్టార్‌

వీసా పునరుద్ధరణ పిటిషన్‌ను  తిరస్కరించిన కోర్టు

నేటినుంచే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌


మెల్‌బోర్న్‌: ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తలపడాలన్న ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌  జొకోవిచ్‌ కల చెదిరింది. టోర్నీలో ఆడకుండా ఆస్ట్రేలియా మంత్రి రద్దు చేసిన వీసాను పునరుద్ధరించాలన్న జొకోవిచ్‌ పిటిషన్‌ను ఇక్కడి ఫెడరల్‌ కోర్టు తిరస్కరించింది. దీంతో దాదాపు పదిరోజులుగా జొకో చేసిన న్యాయపోరాటం ముగిసింది. దీంతో అతను తన సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం ఆస్ట్రేలియాను వీడాడు. అంటే.. సోమవారం నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌ ఆడడం లేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనే క్రీడాకారులు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను తీసుకోవాలన్న నిబంధన నుంచి మినహాయింపు పొందిన జొకోవిచ్‌.. ఈ విషయంలో తనను వ్యతిరేకిస్తున్న ఆసీస్‌ ప్రభుత్వంపై మొదట కోర్టుకెళ్లి గెలిచాడు. కానీ, ఆసీస్‌ ఇమ్మిగ్రేషన్‌ శాఖ మంత్రి తన విచక్షణాధికారంతో రెండోసారి వీసాను రద్దు చేయడంతో మళ్లీ కోర్టుకెళ్లగా.. ఈసారి జొకోకు చుక్కెదురైంది. ఇక వీసా రద్దుతో ఆసీస్‌ నిబంధనల ప్రకారం జొకోవిచ్‌ మూడేళ్లపాటు ఆ దేశంలో అడుగుపెట్టేందుకు అవకాశం లేదు. ఇక, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ లేకపోవడంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ఈసారి నడాల్‌, మెద్వెదేవ్‌ టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో లోకల్‌ స్టార్‌ ఆష్లే బార్టీ, జపాన్‌ సంచలనం నవోమి ఒసాక టైటిల్‌ వేటలో ఉన్నారు.  

Updated Date - 2022-01-17T08:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising