ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Australia in India: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు వేదికలు ఖరారు.. ఎక్కడెక్కడంటే..

ABN, First Publish Date - 2022-11-16T22:00:49+05:30

వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చిలో భారత్-ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ (Australia In India) టెస్ట్ సిరీస్ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చిలో భారత్-ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ (Australia In India) టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య 4 టెస్టు మ్యాచ్‌లు జరగనుండగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఢిల్లీ (Delhi) నగరం ఒక మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. ఇక మిగతా టెస్టులకు అహ్మదాబాద్, ధర్మశాలలో.. మరో మ్యాచ్ నాగ్‌పూర్ లేదా చెన్నైలో నిర్వహించనున్నామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కాగా బీసీసీఐ (BCCI) రోటేషన్ ఫార్ములా ప్రకారం.. కరోనా ప్రభావం చూపిన రెండేళ్లలో ఢిల్లీ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశాలను కోల్పోయింది. డిసెంబర్ 2017లో శ్రీలంక-ఇండియా మధ్య ఇక్కడ చివరి టెస్టు మ్యాచ్‌ జరిగింది.

కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) రెండవ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియా చాలా ముఖ్యమైనది. డబ్ల్యూటీసీలో తదుపరి దశకు చేరాలంటే ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో టీమిండియా సిరీస్‌ను దక్కించుకోవాలి. ఈ భారీ స్థాయి విజయం రోహిత్ సేనకు అంత సులభమేమీకాదనే విశ్లేషణలు వినపడుతున్నాయి.

Updated Date - 2022-11-16T22:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising