ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ.. చేజేతులా

ABN, First Publish Date - 2022-05-22T09:33:26+05:30

ప్లేఆ్‌ఫ్సకు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోల్తా పడింది. అన్ని విభాగాల్లోనూ పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైపై ఓటమితో నిష్క్రమణ 

ప్లేఆ్‌ఫ్సకు బెంగళూరు

ముంబై: ప్లేఆ్‌ఫ్సకు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోల్తా పడింది. అన్ని విభాగాల్లోనూ పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకుంది. దీనికి తోడు కెప్టెన్‌ పంత్‌ వ్యూహాత్మక తప్పిదం జట్టు ఓటమికి దారి తీసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 14 పాయింట్లతో ఢిల్లీ నిష్క్రమించగా.. 16 పాయింట్లతో ఉన్న బెంగళూరు ప్లేఆ్‌ఫ్సకు వెళ్లింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. పావెల్‌ (43), పంత్‌ (39) రాణించారు. బుమ్రాకు మూడు, రమణ్‌దీ్‌పనకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఇషాన్‌ (48), బ్రెవిస్‌ (37), డేవిడ్‌ (11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34) ఆదుకున్నారు. నోకియా, శార్దూల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.


ఆ రివ్యూ కోరి ఉంటే..:

ఓ మాదిరి ఛేదనలో పవర్‌ప్లేలో ముంబై 27 పరుగులే చేసింది. కానీ ఇషాన్‌, బ్రెవి్‌సతో పాటు ఆఖర్లో డేవిడ్‌ చెలరేగడంతో ఢిల్లీ కుదేలైంది. రెండో ఓవర్‌లో ఇషాన్‌ చెలరేగి 4,6,4తో 14 రన్స్‌ రాబట్టినా మరో ఎండ్‌లో రోహిత్‌ 13 బంతుల్లో రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లలో 44/1తో ఉన్న స్కోరు బ్రెవిస్‌ రాకతో వేగం పుంజుకుంది. పదో ఓవర్‌లో అతడి 6,4 ఇషాన్‌ సిక్స్‌తో 18 రన్స్‌ సాధించింది. అయితే రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాక ఇషాన్‌ను 12వ ఓవర్‌లో కుల్దీప్‌ అవుట్‌ చేశాడు. అయితే అదే ఓవర్‌లో బ్రెవిస్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పంత్‌ వదిలేశాడు. చక్కగా కుదురుకున్న బ్రెవి్‌సను శార్దూల్‌ అవుట్‌ చేయడంతో ఢిల్లీ తిరిగి పోటీలోకొచ్చింది.


ఆ వెంటనే డేవిడ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్‌ అవుట్‌ అయినప్పటికీ.. పంత్‌ రివ్యూకు వెళ్లకపోవడం కొంప ముంచింది. ఆ తర్వాత డేవిడ్‌ ఎడాపెడా బౌండరీలతో ఛేదన సులువు చేశాడు. 17వ ఓవర్‌లో 4,6తో పాటు తిలక్‌ (21) ఫోర్‌తో 17 పరుగులు రాగా.. 18వ ఓవర్‌లో డేవిడ్‌ రెండు సిక్సర్లు బాది అవుటయ్యాడు. అప్పటికి 13 బంతుల్లో 15 రన్స్‌ కావాల్సి ఉండగా ముంబై విజయం సులువే అయ్యింది. 19వ ఓవర్‌లో తిలక్‌ అవుట్‌ అయినా సమీకరణం ఆరు బంతుల్లో ఐదు పరుగులకు చేరింది. ఇక ఖలీల్‌ తొలి బంతిని నోబ్‌గా వేశాడు. ఫ్రీహిట్‌ను రమణ్‌దీప్‌ ఫోర్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.


ఆదుకున్న పావెల్‌, పంత్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆరంభంలోనే ముంబై బౌలర్లు బెంబేలెత్తించారు. బంతి టర్న్‌తో పాటు చక్కగా బౌన్స్‌ కావడంతో ఢిల్లీ పరుగుల కోసం తంటాలు పడింది. కానీ పంత్‌, పావెల్‌ అద్భుత భాగస్వామ్యంతో జట్టును పోటీలో ఉంచారు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (5)ను సామ్స్‌ అవుట్‌ చేయగా.. మిచెల్‌ మార్ష్‌ (0)తో పాటు దూకుడుగా ఆడిన పృథ్వీ షా (24)ను బుమ్రా దెబ్బతీశాడు. దీంతో 31/3 స్కోరుతో కష్టాల్లో పడింది. వచ్చీ రాగానే సిక్స్‌ బాదిన సర్ఫరాజ్‌ (10) కూడా ఎక్కువసేపు నిలువలేదు. ఈ దశలో కెప్టెన్‌ పంత్‌తో పాటు పావెల్‌ జట్టుకు అండగా నిలిచారు.


12వ ఓవర్‌లో పావెల్‌ 6,6,4తో 20 పరుగులు సాధించి స్కోరులో కదలిక తెచ్చాడు. అయితే ఆ తర్వాత మూడు ఓవర్లపాటు ఆట నిదానంగానే సాగడంతో 15 ఓవర్లలో స్కోరు 106/4కి చేరింది. ఇక రమణ్‌దీప్‌ వేసిన 16వ ఓవర్‌లో పంత్‌ 4,4,6తో చెలరేగి 19 రన్స్‌ రాబట్టినా.. ఆఖరి బంతికి అవుట్‌ కావడంతో ఐదో వికెట్‌కు 75 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక డెత్‌ ఓవర్లలోనూ ముంబై పరుగులను నియంత్రించడంతో ఒత్తిడి పెరిగిన పావెల్‌ 19వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో బుమ్రా సూపర్‌ యార్కర్‌కు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో శార్దూల్‌ (4) వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ అక్షర్‌ (19 నాటౌట్‌) సిక్సర్‌తో 9 రన్స్‌ చేయగలిగింది. దీంతో ఢిల్లీ 150 స్కోరు దాటగలిగింది.


ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరంటే.. 

క్వాలిఫయర్‌-1 (మంగళవారం)

గుజరాత్‌ vs రాజస్థాన్‌ 

ఎలిమినేటర్‌ (బుధవారం)

లఖ్‌నవూ vs బెంగళూరు


వేదిక: కోల్‌కతా

స్కోరు బోర్డు


ఢిల్లీ:

పృథ్వీ షా (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 24, వార్నర్‌ (సి) బుమ్రా (బి) సామ్స్‌ 5, మార్ష్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 0, పంత్‌ (సి) ఇషాన్‌ (బి) రమణ్‌దీప్‌ 39, సర్ఫ్‌రాజ్‌ (సి) ఇషాన్‌ (బి) మార్కండే 10, పావెల్‌ (బి) బుమ్రా 43, అక్షర్‌ (నాటౌట్‌) 19, శార్దూల్‌ (సి) డేవిడ్‌ (బి) రమణ్‌దీప్‌ 4, కుల్దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 159/7; వికెట్ల పతనం: 1-21, 2-22, 3-31, 4-50, 5-125, 6-143, 7-151; బౌలింగ్‌: సామ్స్‌ 4-0-30-1, హృతిక్‌ షోకీన్‌ 4-0-34-0, బుమ్రా 4-0-25-3, మార్కండే 4-0-26-1, మెరిడిత్‌ 2-0-9-0, రమణ్‌దీప్‌ 2-0-29-2. 


ముంబై:

రోహిత్‌ (సి) శార్దూల్‌ (బి) నోకియా 2, ఇషాన్‌ (సి) వార్నర్‌ (బి) కుల్దీప్‌ 48, బ్రెవిస్‌ (బి) శార్దూల్‌ 37, తిలక్‌ (సి) పంత్‌ (బి) నోకియా 21, డేవిడ్‌ (సి) షా (బి) శార్దూల్‌ 34, రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 13, సామ్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.1 ఓవర్లలో 160/5; వికెట్ల పతనం: 1-25, 2-76, 3-95, 4-145, 5-155; బౌలింగ్‌: ఖలీల్‌ 3.1-0-24-0, నోకియా 4-0-37-2, శార్దూల్‌ 3-0-32-2, మార్ష్‌ 2-0-7-0, కుల్దీప్‌ 4-0-33-1, అక్షర్‌ 3-0-26-0. 

Updated Date - 2022-05-22T09:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising