ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీప్తి ఆల్‌రౌండ్‌ షో

ABN, First Publish Date - 2022-07-02T10:02:59+05:30

దీప్తి శర్మ (22 నాటౌట్‌, 3/25) ఆల్‌రౌండ్‌ షోతో శ్రీలంక మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ నాలుగు వికెట్లతో గెలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి వన్డేలో భారత్‌ గెలుపు

పల్లెకెలె : దీప్తి శర్మ (22 నాటౌట్‌, 3/25) ఆల్‌రౌండ్‌ షోతో శ్రీలంక మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ నాలుగు వికెట్లతో గెలిచింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక 48.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్‌ హసినీ పెరీరా (37), హర్షిత (28) పర్లేదనిపించారు. ఆఫ్‌ స్పిన్నర్‌ దీప్తిశర్మ, పేసర్‌ రేణుకా సింగ్‌ (3/29) మూడేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 38 ఓవర్లలో 176/6 స్కోరు చేసి విజయం సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (44), ఓపెనర్‌ షఫాలీ (35), హర్లీన్‌ (34) సత్తా చాటారు.  మంధాన (4), యాస్తికా భాటియా (1) విఫలమయ్యారు. లంక స్పిన్నర్‌ రణవీర (4/39) నాలుగు వికెట్లు తీసింది. దీప్తిశర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. అయితే షఫాలీ జతగా హర్మన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. 


సంక్షిప్తస్కోర్లు:

శ్రీలంక:

48.2 ఓవర్లలో 171 ఆలౌట్‌ (నీలాక్షి 43, హాసిని 37, హర్షిత 28, దీప్తిశర్మ 3/25, రేణుక 3/29, పూజ 2/26); భారత్‌: 38 ఓవర్లలో 176/6 (కౌర్‌ 44, షఫాలీ 35, హర్లీన్‌ 34, రణవీర 4/39, రణసింఘే 2/34).

Updated Date - 2022-07-02T10:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising