ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

deepak hooda : దీపక్ హుడా అత్యంత అరుదైన రికార్డ్.. క్రికెట్ ఫ్యాన్స్ వారెవా అంటారేమో..

ABN, First Publish Date - 2022-08-21T23:06:33+05:30

జాతీయ జట్టులోకి ఈ ఏడాదే అడుగుపెట్టిన యంగ్ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా(deepak hooda) టీమిండియాకి(Team India) కీలక ఆట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : జాతీయ జట్టులోకి ఈ ఏడాదే అడుగుపెట్టిన యంగ్ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా(deepak hooda) టీమిండియాకి(Team India) కీలక ఆటగాడిగా పరిణితి చెందుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తూ విలువైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ప్రస్తుత జింబాబ్వే వర్సెస్ ఇండియా సిరీస్(zimbabwe vs india) రెండో వన్డేలోనూ ఆకట్టుకున్నాడు. లక్ష్య చేధనలో కీలక దశలో 25 పరుగులు జోడించి జట్టుని విజయం వైపు నడిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో దీపక్ హుడా అత్యంత అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓటమి ఎరుగకుండా.. వరుసగా అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాడిగా హుడా రికార్డ్ నిలిచాడు. వన్డే, టీ20లు కలిపి హుడా ప్రాతినిధ్య వహించిన 16 మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది.


ఇప్పటివరకు వరుస విజయాల రికార్డు రోమేనియా ఆటగాడు సట్వీక్ నడిగొట్ల పేరిట ఉండేది. అతడు ఆడిన వరుస 15 మ్యాచ్‌ల్లో రొమేనియా జట్టు గెలుపొందింది. ఈ రికార్డు ప్రస్తుతం హుడా వశమైంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపక్ హుడా జట్టులోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌ సిరీస్‌‌లో తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు దీపక్ హుడా మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. 7 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడగా వాటన్నింటిలోనూ ఇండియా జయకేతనం ఎగరవేసింది. హుడా ప్రాతినిధ్య వహించిన ఏ ఒక్క మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోలేదు.  

Updated Date - 2022-08-21T23:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising