ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Navratri celebration : క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్‌ గార్బా డ్యాన్స్

ABN, First Publish Date - 2022-10-03T13:20:25+05:30

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌ నగరంలో జరిగిన ప్రత్యేక వేడుకలో లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్,ప్రపంచ కప్ విజేత భారత బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్(Chris Gayle Virender Sehwag) గార్బా డ్యాన్స్ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోధ్‌పూర్‌(రాజస్థాన్): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌ నగరంలో జరిగిన ప్రత్యేక వేడుకలో లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్,ప్రపంచ కప్ విజేత భారత బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్(Chris Gayle  Virender Sehwag) గార్బా డ్యాన్స్ చేశారు.జోధ్‌పూర్‌లోని(Jodhpur) గార్బా నైట్‌లో(Garba night) క్రిస్ గేల్ అత్యుత్తమ ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టులో క్రిస్ గేల్ సభ్యుడు. వీరేంద్ర సెహ్వాగ్ ఎల్‌ఎల్‌సిలో గుజరాత్ జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.లెజెండ్స్ లీగ్ క్రికెట్ సందర్భంగా గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు నవరాత్రి పండుగను(Navratri celebration) జరుపుకున్నారు.ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు నగరంలో సంబరాలను ఆస్వాదించారు.


జోధ్‌పూర్‌లో జరిగిన వేడుకలో సంప్రదాయ కుర్తా ధరించి సెహ్వాగ్, గేల్ అందరి దృష్టిని ఆకర్షించారు. గేల్ ఎర్ర కుర్తా, తెల్లటి పైజామా ధరించి గార్బా కళాకారుల బృందంతో కలిసి డ్యాన్స్(garba dance) చేశాడు.గుజరాత్‌లో(gujarat) జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సిందూ, నీరజ్ చోప్రా వంటివారు కూడా గార్బా నృత్యం చేశారు.జోధ్‌పూర్‌లోని బర్కతుల్లా ఖాన్ స్టేడియంలో ఎలిమినేటర్‌లో అదానీ స్పోర్ట్స్‌లైన్ యాజమాన్యంలోని గుజరాత్ జెయింట్స్, భిల్వారా కింగ్స్‌తో సోమవారం క్రిస్ గేల్,వీరేంద్ర సెహ్వాగ్ తిరిగి ఆడనున్నారు.గత వారం క్రిస్ గేల్ 40 బంతుల్లో 68 పరుగులు చేసిన తర్వాత కింగ్స్‌ను ఓడించిన గుజరాత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది.క్రికెటర్ల డ్యాన్స్ వీడియోను 5,756 లైక్ లు, 540 రీట్వీట్లు వచ్చాయి.



Updated Date - 2022-10-03T13:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising