ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishab pant: సెమీస్‌లో పంత్‌కు చాన్స్‌

ABN, First Publish Date - 2022-11-08T03:57:20+05:30

ఇంగ్లండ్‌తో గురువారం జరిగే సెమీ్‌సలోనూ రిషభ్‌ బరిలో దిగుతాడని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సూచనప్రాయంగా వెల్లడించాడు. చక్కటి ఫినిషర్‌గా పేరుండడంతో మెగా టోర్నీ సూపర్‌-12 నాలుగు మ్యాచ్‌ల్లో దినేశ్‌ కార్తీక్‌ పట్లే జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది. Chance for Pant in semis

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రవిడ్‌ సూచనప్రాయంగా వెల్లడి

మెల్‌బోర్న్‌: ఇంగ్లండ్‌తో గురువారం జరిగే సెమీ్‌సలోనూ రిషభ్‌ బరిలో దిగుతాడని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సూచనప్రాయంగా వెల్లడించాడు. చక్కటి ఫినిషర్‌గా పేరుండడంతో మెగా టోర్నీ సూపర్‌-12 నాలుగు మ్యాచ్‌ల్లో దినేశ్‌ కార్తీక్‌ పట్లే జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది. కానీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఆసీస్‌ వికెట్లపై దినేశ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌లో పంత్‌ను ఆడించారు. సెమీ్‌సలో లెగ్‌స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నందునే ముందస్తుగా జింబాబ్వేపై పంత్‌ను ఆడించాలని ద్రవిడ్‌ నిర్ణయించినట్టు కనిపిస్తోంది.

కార్తీక్‌ను ఆడించకపోవడమా?: సెహ్వాగ్‌

జింబాబ్వేపై దినేశ్‌ కార్తీక్‌ను ఆడించకపోవడాన్ని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తప్పుబట్టాడు. ‘టోర్నీలో కార్తీక్‌ను ఓ పాచికగా ఉపయోగించుకోవాలని జట్టు యాజమాన్యం భావించివుంటే టోర్నీ అంతా అతడిని ఆడించాలి. కీలకమైన సెమీ్‌సకు ముందు పక్కనబెట్టడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది’ అని అన్నాడు.

Updated Date - 2022-11-08T03:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising