ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంటర్‌ కోర్టు..సెంచరీ!

ABN, First Publish Date - 2022-07-04T10:01:10+05:30

టెన్నిస్‌ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో వింబుల్డన్‌ది ఎంతో ప్రత్యేకం. అలాంటి ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో సెంటర్‌ కోర్టుకు మరీమరీ ప్రాముఖ్యం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వింబుల్డన్‌: టెన్నిస్‌ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో వింబుల్డన్‌ది ఎంతో ప్రత్యేకం. అలాంటి ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో సెంటర్‌ కోర్టుకు మరీమరీ ప్రాముఖ్యం ఉంది. ఈ సెంటర్‌ కోర్టు ఆదివారం శత వసంతాలు పూర్తి చేసుకుంది. 1922, జూలై మూడున సెంటర్‌ కోర్టు ప్రారంభమైంది. సాధారణంగా 14 రోజులు జరిగే వింబుల్డన్‌లో తొలి ఆదివారం విశ్రాంతి. కానీ సెంటర్‌ కోర్టు వందేళ్ల ఉత్సవం సందర్భంగా ఈ ఆదివారం పోటీలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా కోర్టు చైర్‌ అంపైర్‌ పక్కన ‘సెంటర్‌ కోర్టు, 100’ అని పెద్ద అక్షరాలతో రాశారు. ఈ శత వసంతాల సందర్భంగా వింబుల్డన్‌ మాజీ చాంపియన్లు బిల్లీజీన్‌ కింగ్‌, మార్గరెట్‌ కోర్ట్‌, క్రిస్‌ ఎవర్ట్‌, బర్తోలి, వీనస్‌ విలియమ్స్‌, బియాన్‌ బోర్గ్‌, జాన్‌ మెకన్రో, బర్తోలి, ఫెడరర్‌, నడాల్‌, జొకోవిచ్‌ హాజరై సెంటర్‌ కోర్టులో సందడి చేశారు.  

Updated Date - 2022-07-04T10:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising