ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 ఏళ్ల నిరీక్షణకు ముగింపు..

ABN, First Publish Date - 2022-08-08T10:22:21+05:30

కెప్టెన్‌ సవితా పూనియా ముందుండి నడిపించగా..ఆస్ట్రేలియాతో సెమీ్‌సలో ‘సమయ’ వివాద ఓటమి బాధనుంచి తేరుకున్న భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకంతో ఊరట చెందింది. ఈ ప్లేఆఫ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెప్టెన్‌ సవితా పూనియా ముందుండి నడిపించగా..ఆస్ట్రేలియాతో సెమీ్‌సలో ‘సమయ’ వివాద ఓటమి బాధనుంచి తేరుకున్న భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకంతో ఊరట చెందింది. ఈ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో..షూటవుట్‌లో 2-1తో న్యూజిలాండ్‌పై గెలుపొందిన జట్టు మూడో స్థానం దక్కించుకుంది. 16 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌లో మనోళ్లకు లభించిన తొలి పతకం ఇది కావడం గమనార్హం. నిర్ణీత సమయానికి రెండు జట్లూ 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్‌ షూటవుట్‌కు దారితీసింది.


మ్యాచ్‌ ఆసాంతం 1-0 ఆధిక్యంలో నిలిచిన సవిత సేన..చివరి 30 సెకన్లలో ప్రత్యర్థికి పెనాలీ కార్నర్‌ సమర్పించుకుంది. సలీమా టేటె 29వ నిమిషంలో గోల్‌ కొట్టి జట్టును ముందంజలో నిలిపింది. ఇక షూటవుట్‌లో కెప్టెన్‌, గోల్‌కీపర్‌ సవిత తన సత్తా ఏమిటో నిరూపించింది. మూడు గోల్స్‌ను అద్భుతంగా అడ్డుకున్న పూనియా..జట్టుకు కాంస్యం లభించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. షూటవుట్‌లో మేగన్‌ హల్‌ కివీ్‌సకు ఖాతా తెరిచింది. కానీ రోస్‌, కాటీ, ఒలీవియా గోల్‌ ప్రయత్నాలను సవిత అడ్డుకుంది. కాగా..సోనిక, నవ్‌నీత్‌ భారత్‌కు గోల్స్‌ అందించారు. 2002 మాంచెస్టర్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళలు, 2006 మెల్‌బోర్న్‌లో రజత పతకం గెలిచారు.

Updated Date - 2022-08-08T10:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising