ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోర్డు సన్మానానికి విరాట్‌ నో!

ABN, First Publish Date - 2022-01-19T08:46:44+05:30

భారత జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటిదాకా 99 టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికాతో సిరీ్‌సను 1-2తో ఓడిన అనంతరం అతడు కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటిదాకా 99 టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికాతో సిరీ్‌సను 1-2తో ఓడిన అనంతరం అతడు కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేయకముందు బీసీసీఐకి తన నిర్ణయాన్ని తెలిపాడు. ఈ సమయంలో బోర్డు ఇచ్చిన ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడట. అదేమిటంటే.. తన కెప్టెన్సీలోనే బెంగళూరులో వందో టెస్టును ఫేర్‌వెల్‌ మ్యాచ్‌గా ఆడాలని బోర్డు కోరినట్టు సమాచారం. వచ్చే నెలలో శ్రీలంకతో భారత్‌ టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. ‘ఒక్క మ్యాచ్‌తో పరిస్థితులేమీ మారవు. అలాంటి వాటిని పట్టించుకునే వాడిని కాదు’ అని కోహ్లీ స్పష్టం చేసినట్టు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సేవలందించినందుకు బోర్డు అతడిని తగిన రీతిలో గౌరవిద్దామనుకున్నట్టుంది. కానీ వన్డే కెప్టెన్సీని బలవంతంగా లాగేసుకున్నారనే భావనలో ఉన్న కోహ్లీ ఈ ఆఫర్‌ పట్ల సానుకూలత వ్యక్తం చేయలేదు.

Updated Date - 2022-01-19T08:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising