ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐఎఫ్ఎఫ్‌ అధ్యక్ష రేసులో భూటియా

ABN, First Publish Date - 2022-08-20T10:55:01+05:30

దిగ్గజ ఆటగాడు బైచుంగ్‌ భూటియా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దిగ్గజ ఆటగాడు బైచుంగ్‌ భూటియా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశాడు. అయితే రాజకీయ పార్టీల మద్దతుతో పలువురు అధ్యక్ష పదవికి పోటీపడుతుండడంతో భూటియాకు ఈ ఎన్నికలు అంత సులువు కాబోవు. ఈనెల 28న జరిగే ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు గడువు శుక్రవారంతో ముగిసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ నేత, మోహన్‌ బగాన్‌, ఈస్ట్‌బెంగాల్‌ మాజీ గోల్‌కీపర్‌ కళ్యాణ్‌ చౌబే.. భూటియాకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచాడు. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజీత్‌ బెనర్జీ కూడా రేసులో ఉన్నారు.


పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఆయన అన్నయ్య. ఇక, భారత మాజీ మిడ్‌ఫీల్డర్‌, మేఘాలయా రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే యూజెన్సన్‌ లింగ్డో.. కర్ణాటకలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్‌ఏ హారిస్‌ కూడా అధ్యక్ష పదవికి తలపడుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, దివంగత జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు, మరో కాంగ్రెస్‌ నేత మానవేంద్ర సింగ్‌ కూడా నామినేషన్‌ వేశారు.. ఫుట్‌బాల్‌ ఢిల్లీ అధ్యక్షుడు షాజీ ప్రభాకరన్‌ కూడా అధ్యక్షపదవికి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

Updated Date - 2022-08-20T10:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising