ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లా క్రికెట్‌ను తాకిన ‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదన్న బౌలర్!

ABN, First Publish Date - 2022-01-24T02:20:00+05:30

టాలీవుడ్ ‘మెగా’ హీరో అల్లు అర్జున్ నటించిన సినిమా ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును కొల్లగొట్టింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: టాలీవుడ్ ‘మెగా’ హీరో అల్లు అర్జున్ నటించిన సినిమా ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును కొల్లగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన తీరుకు సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులోని పాటలు, అల్లు మేనరిజమ్‌ను అనుకరిస్తూ పలువురు సెలబ్రిటీలు షార్ట్స్ చేస్తూ ముచ్చపడుతున్నారు. ఇప్పుడీ మేనరిజమ్స్ మేనియాగా మారి ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ను మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నాయి. 


టాలీవుడ్ సినిమాలను, నటులను అనుకరించడం క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో మొదలైంది. గతంలో ఎన్నో సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేస్తూ, డైలాగ్స్ చెబుతున్న వీడియోలను అభిమానులతో పంచుకున్న వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది అభిమానులున్నారు. ఇక ‘పుష్ప’ సినిమా ట్రైలర్స్ నుంచే అల్లును వార్నర్ అనుకరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా తన నటనా చాతుర్యాన్ని బయపెట్టాడు. తాజాగా, ఇప్పుడు ‘పుష్ప’ మేనియా బంగ్లాదేశ్ క్రికెటర్లను తాకింది. వికెట్ తీసిన ఆనందంలో ఓ బౌలర్ అల్లు అర్జున్‌లా మెడకింద చెయ్యి తిప్పి  ‘తగ్గేదేలే’ అంటూ పోజిచ్చాడు.


బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో సిల్‌హెట్ సన్‌రైజర్స్ బౌలర్ నజ్ముల్ ఇస్లామ్ వేసిన బంతిని సిక్సర్‌కు తరలించబోయిన ప్రత్యర్థి బ్యాటర్.. డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డర్ చేతికి చిక్కాడు. అది చూసిన నజ్ముల్.. వికెట్ దక్కిన ఆనందంలో పుష్ప స్టైల్‌లో ‘తగ్గేదే లే’ అంటూ మెడకింది నుంచి చెయ్యిని పోనిచ్చాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. మీ చూడండి మరి. 




Updated Date - 2022-01-24T02:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising