ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాత్రాకు కోర్టులో ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2022-05-26T10:39:31+05:30

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఓఏ ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటన

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కొత్తవారికి అవకాశమిచ్చేందుకే త్వరలో జరగబోయే ఐఓఏ ఎన్నికల్లో తాను బరిలోకి దిగడం లేదంటూ కోర్టు తీర్పును ప్రస్తావించకుండా బాత్రా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం ఏదైన జాతీయ క్రీడా సంఘం కార్యవర్గ సభ్యుడైతేనే ఐఓఏ ఎన్నికల్లో పోటీ చేయాలని స్పష్టంగా ఉంది. అయితే, బాత్రా హాకీ ఇండియా కార్యవర్గ సభ్యుడు కాకపోయినా జీవితకాల సభ్యుడి హోదాలో 2017 ఐఓఏ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా హైకోర్టు హాకీ ఇండియాలో బాత్రా సభ్యత్వానికి చట్టబద్ధత లేదని, ఐఓఏలో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడానికి ఆ హోదా పనికిరాదని బుధవారం తీర్పునిచ్చింది. భారత హాకీ  మాజీ క్రీడాకారుడు 1975 వరల్డ్‌కప్‌ గెల్చిన భారత జట్టు సభ్యుడు అస్లం షేర్‌ ఖాన్‌ వేసిన ఈ కేసుతో ఐఓఏలో బాత్రా పునాదులు కదిలాయి.

Updated Date - 2022-05-26T10:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising