ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Commonwealth Games: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. తొలి ఓవర్‌లోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2022-07-29T22:49:47+05:30

కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎడ్జ్‌బాస్టన్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 25 పరుగుల వద్ద ఓపెనర్ స్మృతి మంధాన (24)న వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ యస్తికా భాటియా 8 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయింది. అనంతరం వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. మరోవైపు, కెప్టెన్ అండగా షెఫాలీ చెలరేగింది. 33 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసి అర్ధ సెంచరీ ముందు పెవిలియన్ చేరింది. 


ఆ తర్వాతి నుంచి వికెట్లు టపటపా రాలిపోయాయి. జెమీమా రోడ్రిగ్స్ (11), దీప్తిశర్మ (1), హర్లీన్ డియోల్ (7) వికెట్లను త్వరత్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన హర్మన్‌ప్రీత్ మాత్రం ఆసీస్ బౌలర్లను ఎదురొడ్డుతూ పరుగులు రాబట్టింది. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసి అవుటైంది. ఆసీస్ బౌలర్లలో జొనాసెన్ 4 వికెట్లు తీసుకోగా, షట్ రెండు వికెట్లు తీసుకుంది. 


అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు రెండో బంతికే ఎదురుదెబ్బ తగిలింది. రేణుక సింగ్ వేసిన ఇన్నింగ్ రెండో బంతికి ఓపెనర్ అలిస్సా హీలీ డకౌట్ అయి వెనుదిరిగింది. 

Updated Date - 2022-07-29T22:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising