ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అథ్లెట్‌ పూవమ్మపై రెండేళ్ల నిషేధం

ABN, First Publish Date - 2022-09-20T09:34:52+05:30

భారత సీనియర్‌ అథ్లెట్‌, ఆసియా క్రీడల పతక విజేత ఎమ్‌ఆర్‌ పూవమ్మపై వేటు పడింది. గతేడాది డోప్‌ పరీక్షలో విఫలమైన ఈ కర్ణాటక అథ్లెట్‌పై రెండేళ్ల నిషేధం విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత సీనియర్‌ అథ్లెట్‌, ఆసియా క్రీడల పతక విజేత ఎమ్‌ఆర్‌ పూవమ్మపై వేటు పడింది. గతేడాది డోప్‌ పరీక్షలో విఫలమైన ఈ కర్ణాటక అథ్లెట్‌పై రెండేళ్ల నిషేధం విధించారు. 32 ఏళ్ల పూవమ్మ గతేడాది ఫిబ్రవరిలో ఇండియా గ్రాండ్‌ ప్రీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్లు రుజువైంది. దీంతో డోపింగ్‌ వ్యతిరేక క్రమశిక్షణ ప్యానెల్‌ ఈ జూన్‌లో పూవమ్మపై కేవలం మూడు నెలల సస్పెన్షన్‌ మాత్రమే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


ఈ ప్యానెల్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ డోపింగ్‌ నిరోధక అప్పీల్‌ ప్యానెల్‌ (ఏడీఏపీ)కు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) అప్పీలు చేసింది. దీంతో ఏడీపీఏ పూవమ్మపై రెండు నెలల నిషేధాన్ని విధించాలని ఆదేశాలు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన భారత మహిళల 4.400 మీటర్ల రిలే, మిక్స్‌డ్‌ రిలే జట్లలో పూవమ్మ సభ్యురాలు. 2012 ఆసియా క్రీడల మహిళల 400 మీటర్లలో పూవమ్మ కాంస్యం గెలుచుకుంది. 2015లో ఆమె అర్జున అవార్డు కూడా అందుకుంది. 

Updated Date - 2022-09-20T09:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising