ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరాట్‌ మొదలెట్టాడు

ABN, First Publish Date - 2022-08-12T09:22:33+05:30

టీ20 ప్రపంచక్‌పనకు ముందు భారత క్రికెటర్లకు ఆసియాకప్‌ టోర్నీ కీలకం కానుంది. ఈనెల 27 నుంచి దుబాయ్‌లో జరిగే ఈ టోర్నీలో ఆరు దేశాలు పాల్గొననున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీ20 ప్రపంచక్‌పనకు ముందు భారత క్రికెటర్లకు ఆసియాకప్‌ టోర్నీ కీలకం కానుంది. ఈనెల 27 నుంచి దుబాయ్‌లో జరిగే ఈ టోర్నీలో ఆరు దేశాలు పాల్గొననున్నాయి. ఇందులో సత్తా చాటుకుని తద్వారా వరల్డ్‌క్‌పనకు ఎంపిక కావాలని భారత యువ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఫామ్‌ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ గురువారం తన ప్రాక్టీ్‌సను ఆరంభించాడు. ఈమేరకు ముంబైలోని బీకేసీ ఇండోర్‌ కాంప్లెక్స్‌లో వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న వీడియోను తను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. మరోవైపు ఆసియాకప్‌ ఇతర ఆటగాళ్లకేమో కానీ విరాట్‌కు మాత్రం అత్యంత కీలకం కానుంది.


జట్టులో చోటు కోసం నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. ఫామ్‌లో లేని కోహ్లీని కొనసాగించడంపై ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది తను కేవలం నాలుగు అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇందులో చేసింది కూడా 20.25 సగటుతో 81 పరుగులే. అంతకుముందు ఐపీఎల్‌లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 16 ఇన్నింగ్స్‌లో 341 పరుగులు సాధించాడు. దీనికి తోడు మూడు ఫార్మాట్లలోనూ శతకం బాదక మూడేళ్లవుతున్నా ఆసియాక్‌పలో చోటెందుకనే చర్చ కూడా అతడిపై ఒత్తిడి పెంచుతోంది. అటు ఎంతో ప్రతిభ కలిగిన సంజూ శాంసన్‌లాంటి ప్లేయర్‌ను పక్కనబెట్టి విరాట్‌ కోహ్లీని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు సెలెక్టర్లను తప్పుపడుతున్నారు. అంతకుముందు విండీస్‌ టూర్‌ మొత్తానికి కోహ్లీ దూరంగా ఉండడంతో ఆసియాక్‌పలోనూ ఆడేది అనుమానమే అని చాలా మంది భావించారు. కానీ బ్రేక్‌ తర్వాత అతను జట్టులోకి వచ్చాడు. ఈ విరామం తనకు మంచే చేయాలని, తిరిగి మనపటి ఫామ్‌ అందుకుని పరుగుల వరద పారించాలని భారత క్రీడాభిమానులు కూడా కోరుకుంటున్నారు.


కోహ్లీ ప్రయత్నం అభినందనీయం: మంజ్రేకర్‌

దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌లో విఫలమయ్యాడని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ తెలిపాడు. రోహిత్‌ ఆధ్వర్యంలో భారత జట్టు టీ20 సరికొత్త వ్యూహంతో ఆడుతోందని, ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగడమే వారి లక్ష్యంగా ఉందని అన్నాడు. ఇందులో భాగంగానే కోహ్లీ కూడా అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తూ వికెట్లు సమర్పించుకున్నట్టు చెప్పాడు. ఏదిఏమైనా తను కొత్త తరహా ఆటను ప్రయత్నిస్తున్నందుకు అభినందించాలని మంజ్రేకర్‌ అన్నాడు. అందుకే తను ఫామ్‌లో లేకపోయినా జట్టు వ్యూహంలో భాగంగా తొలి బంతి నుంచే పరుగులు రాబట్టాలని చూసినట్టు గుర్తుచేశాడు.

Updated Date - 2022-08-12T09:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising