ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arshdeep Singh: ఈజీ క్యాచ్ వదిలేసిన అర్షదీప్ సింగ్.. రోహిత్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి!

ABN, First Publish Date - 2022-09-05T23:53:28+05:30

‘క్యాచ్‌లే మ్యాచ్‌ను గెలిపిస్తాయి’.. క్రికెట్‌లో తరచూ వినిపించే మాట ఇది. తాజాగా టీమిండియా బౌలర్ అర్షదీప్ (Arshdeep Singh)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ‘క్యాచ్‌లే మ్యాచ్‌ను గెలిపిస్తాయి’.. క్రికెట్‌లో తరచూ వినిపించే మాట ఇది. తాజాగా టీమిండియా బౌలర్ అర్షదీప్ (Arshdeep Singh) దీనిని మరోమారు నిజం చేశాడు. పాకిస్థాన్‌తో ఆదివారం రాత్రి జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో కీలక సమయంలో అర్షదీప్ క్యాచ్‌ను వదిలేశాడు. ఇది మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది. చివరికి పాకిస్థాన్ (pakistan) విజయానికి కారణమైంది. 


లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కూడా మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. తాజా మ్యాచ్ కూడా చివరి వరకు సాగి నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. బౌలింగులో పిన్ పాయింట్ యార్కర్లు సంధించి పాక్ బ్యాట్లను కంగారెత్తించిన అర్షదీప్ (arshdeep) సింపుల్ క్యాచ్‌ను వదిలేయడం ద్వారా విమర్శలు మూటగట్టుకున్నాడు. మ్యాచ్ ఓటమికి అతడే కారణమంటూ తిట్టిపోస్తున్నారు. కీలక సమయంలో అసిఫ్ అలీ (asif ali) క్యాచ్‌ను జారవిడిచి అతడికి లైఫ్ ఇవ్వడంతో పాక్ బతికిపోయింది. అదే ఆ జట్టు విజయానికి బాటలు వేసింది. నిజానికి ఆ క్యాచ్ పట్టి ఉంటే కనుక పాక్ పని అయిపోయేదే. కానీ చిన్న తప్పిదం భారత్ పరాజయానికి బాటలు వేసింది. కాగా, అర్షదీప్ క్యాచ్‌ను జారవిడిచాక కెప్టెన్ రోహిత్ శర్మ (rohit sharma) రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిని మీరూ చూడండి.



Updated Date - 2022-09-05T23:53:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising