ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ వదిలిరండి.. శ్రీలంక ఆటగాళ్లకు రణతుంగ వినతి

ABN, First Publish Date - 2022-04-12T23:03:21+05:30

కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం, ఆ దేశానికి వరల్డ్ కప్ అందించిన లెజెండ్ అర్జున్ రణతుంగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం, ఆ దేశానికి వరల్డ్ కప్ అందించిన లెజెండ్ అర్జున రణతుంగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర సవాళ్ల మధ్య దేశం నలిగిపోతున్న తరుణంలోనూ శ్రీలంక ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీలో కొనసాగడాన్ని తప్పబట్టాడు. ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీల తరపున ఆడడాన్ని ఆయన విమర్శించాడు. కనీసం వారం రోజులపాటైనా ఐపీఎల్ వదిలి స్వేదేశానికి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని రణతుంగ కోరాడు. ఆటగాళ్ల పేర్లు చెప్పాలనుకోవడం లేదు. కానీ ఐపీఎల్ లో ఎవరెవరు ఆడుతున్నారో వాళ్లకు తెలుసు. వారంపాటు ఆటను విడిచిపెట్టంది. స్వదేశంలో నిరసనకారులకు మద్దతివ్వాలని ఆటగాళ్లను విన్నవించాడు. కాగా శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, లసిత్ మలింగ్ వారి ఫ్రాంచైజీలకు సేవలు అందిస్తున్నారు. ఇక  హసరంగా, భనుకా రాజపక్సే, దుశ్మంత చమీరా, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ వారి ఫ్రాంచైజీలకు ఆడుతున్నారు.


కాగా కోవిడ్ మహమ్మారి సంక్షోభం మొదలైన నాటి నుంచి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. విదేశీ మారక నిల్వలు కనిష్ఠానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగడం ఆ ద్వీప దేశాన్ని కుదిపేస్తున్న విషయం విధితమే. 

Updated Date - 2022-04-12T23:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising