ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli,Anushka Sharma: కోహ్లీ,అనుష్క దంపతుల గురించి పాక్ మాజీ క్రికెటర్ ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2022-09-10T15:15:42+05:30

విరాట్‌కోహ్లీ(Virat Kohli),అనుష్కశర్మ(Anushka Sharma) దంపతులపై(Couple) పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: విరాట్‌కోహ్లీ(Virat Kohli),అనుష్కశర్మ(Anushka Sharma) దంపతులపై(Couple) పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతర్జాతీయ క్రికెట్‌లో తన 71వ సెంచరీ( 71st century) చేసిన తర్వాత విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలపై షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. గత మూడేళ్లుగా సెంచరీ చేయని స్టార్ బ్యాటర్‌ కోహ్లి, ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో(Asia Cup) ఆఫ్ఘనిస్థాన్‌పై ట్రిపుల్ ఫిగర్‌లను చేరుకున్నాడు.కోహ్లీ 61 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌లతో అజేయంగా 122 పరుగులు చేశారు. దీంతో కోహ్లీ, అనుష్కలను పవర్ కపుల్‌ అంటూ(Power Couple)మాజీ పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్(former Pakistan pacer Shoaib Akhtar) అభినందించాడు. 


‘‘కోహ్లీ ఉక్కుతో చేసిన మనిషి(Man Made Of Steel), ఆయన సతీమణి అనుష్కా శర్మ ఉక్కుమహిళ(Iron Lady)’’ అని షోయబ్ అభివర్ణించాడు. ఈ మేర తన యూట్యూబ్ ఛానెల్‌లో(YouTube channel) అప్‌లోడ్ చేసిన వీడియోలో షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.‘‘భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(India batting legend Sachin Tendulkar) 100 సెంచరీలతో రికార్డు సృష్టించారు.కోహ్లి టెండూల్కర్ రికార్డును సమం చేయగలిగితే, అతను ఆల్ టైమ్ గొప్ప బ్యాటర్‌గా గుర్తుంటాడు’’అని అక్తర్ పేర్కొన్నాడు.విరాట్ కోహ్లికి అక్తర్ అభినందనలు తెలిపారు. ‘‘మీరు చాలా గొప్పవ్యక్తి. ఎదుగుతూ ఉండండి...రాబోయే 29 సెంచరీలు గుర్తుంచుకోండి, మీరు క్రికెట్ చరిత్రలో గొప్ప వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు’’ అని షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-09-10T15:15:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising