ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anushka Sharma & Virat Kohli: స్కూటర్‌పై చక్కర్లు కొట్టిన విరుష్క దంపతులు.. క్యూట్ కపుల్ అంటున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-08-21T02:52:13+05:30

ఇండియాలో ‘క్యూటెస్ట్ కపుల్’ అవార్డు ఏదైనా ఉంటే అది టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ (Virushka

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఇండియాలో ‘క్యూటెస్ట్ కపుల్’ అవార్డు ఏదైనా ఉంటే అది టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ (Virushka) దంపతులకే దక్కుతుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒక్కరికొకరు మద్దతుగా ఉంటూ చక్కని పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు. ‘ఇంటర్నెట్ మోస్ట్ ఫేవరెట్ జోడీ’ వీరే అనడం  అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను వారెప్పుడు పోస్టు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాను, కోహ్లీ అభిమానులను ఊపేస్తోంది. 


తమను ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్లు తగిలించుకున్న కోహ్లీ, అనుష్క ఆపై స్కూటరెక్కి ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. స్కూటర్‌ను కోహ్లీ స్మూత్‌గా డ్రైవ్ చేస్తుంటే వెనక అనుష్క అతడిని పట్టుకుని కూర్చుంది. వర్షం పడేలా ఉండడంతో ఓ గొడుగును కూడా పట్టుకున్నారు. తమ పక్క నుంచే వెళ్తున్నప్పటికీ వాహనదారులు వారిని గుర్తించలేకపోయారు. అయితే, కొందరు మాత్రం గుర్తించి ఫొటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇంకొందరు వారిని వీడియో తీస్తూ అనుసరించారు. 

 

కోహ్లీ బ్లాక్ ప్యాంట్, గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించగా, అనుష్క బ్లాక్ కలర్ ట్రాక్ సూట్ ధరించింది. రోడ్ల‌పై ఉన్న గుంత‌ల‌ను త‌ప్పించుకుంటూ కోహ్లీ చాలా జాగ్ర‌త్త‌గా స్కూటీని న‌డిపాడు. ఇద్ద‌రూ హెల్మెట్లు పెట్టుకుని ఉండ‌టంతో చాలా మంది వారిని గుర్తించ‌లేదు. అయితే  కొందరు వారిని అనుసరిస్తూ వీడియోలు తీస్తుండడంతో అనుష్క వారిని వారించింది. 1:6 నిమిషాల నిడివి ఈ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఈ వీడియోను చూస్తున్న కోహ్లీ అభిమానులు.. ‘క్యూట్ కపుల్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



Updated Date - 2022-08-21T02:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising