ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andrew Symonds: యాక్సిడెంట్ సైట్ వద్ద హృదయాన్ని ద్రవించే నోట్ పెట్టిన సోదరి

ABN, First Publish Date - 2022-05-16T21:59:34+05:30

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds) ప్రమాదానికి గురైన స్థలం వద్ద ఆయన సోదరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds) ప్రమాదానికి గురైన స్థలం వద్ద ఆయన సోదరి వదిలిపెట్టిన నోట్ లక్షలాదిమంది హృదయాన్ని ద్రవింపజేసింది. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో శనివారం జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సందర్శించిన సైమండ్స్ సోదరి లూయిస్ భావోద్వేగ నోట్‌ను వదిలిపెట్టింది.


‘‘మరీ తొందరగా వెళ్లిపోయావు. నీ ఆత్మకు శాంతి కలగాలి. మనకు ఇంకో రోజు, మరో ఫోన్ కాల్ ఉంటుందని అనుకున్నాను. నా హృదయం ద్రవించిపోయింది. నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను సోదరా’’ అని రాసిపెట్టిన నోట్‌ను సైమండ్స్ సోదరి లూయిస్ అక్కడ విడిచివెళ్లారు. చానల్ 9 రిపోర్టర్ మియా గ్లోవర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ నోట్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ నోట్ ట్విట్టర్ యూజర్లతో కన్నీళ్లు పెట్టిస్తోంది. 


1998-2009 మధ్య ఆస్ట్రేలియా(Australia)కు ప్రాతినిధ్యం వహించిన ఆండ్రూ సైమండ్స్ 26 టెస్టులు, 198 వన్డేలు ఆడాడు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సైమండ్స్ మృతితో ఆయన భార్య లారా కన్నీటి పర్యంతమయ్యారు. తానింకా షాక్‌లోనే ఉన్నానని, తన ఇద్దరు పిల్లల గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పారు. సైమండ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.  



Updated Date - 2022-05-16T21:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising