ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిడ్నీ.. నాలుగోసారి

ABN, First Publish Date - 2022-07-24T09:58:31+05:30

ఒక ప్రపంచ రికార్డు ఒకసారి బద్దలుగొడితేనే గొప్ప. అలాంటిది ఏకంగా నాలుగుసార్లు తన వరల్డ్‌ రికార్డును తానే తిరగరాసి ఔరా అనిపించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల 400మీ. హర్డిల్స్‌లో

 మెక్‌లాక్లిన్‌కు రికార్డు స్వర్ణం

యూజీన్‌: ఒక ప్రపంచ రికార్డు ఒకసారి బద్దలుగొడితేనే గొప్ప. అలాంటిది ఏకంగా నాలుగుసార్లు తన వరల్డ్‌ రికార్డును తానే తిరగరాసి ఔరా అనిపించింది అమెరికా స్టార్‌ సిడ్నీ మెక్‌లాక్లిన్‌. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప మహిళల 400 మీ. హర్డిల్స్‌లో 22 ఏళ్ల ఈ అమెరికన్‌ 50.68 సెకన్ల రికార్డు టైమింగ్‌తో గమ్యం చేరి పసిడి పతకం పట్టేసింది. ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఫెమ్కే బోల్‌ (నెదర్లాండ్స్‌, 52.27సె.) రజతం, దలీలా మహ్మద్‌ (అమెరికా, 53.13సె.) కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.


నార్మన్‌ ఎట్టకేలకు..

అమెరికాకు చెందిన మైకేల్‌ నార్మన్‌ 400 మీటర్ల రేసులో గొప్ప రన్నర్‌గా పేరుపొందాడు. కానీ అంతర్జాతీయ పోటీలలో ఒత్తిడికిలోనై టైటిల్‌ సాధించడంలో విఫలమవుతుంటాడు. అయితే, ఈసారి చాంపియన్‌షి్‌పలో అతడు పొరపాట్లకు తావివ్వలేదు. 44.29 సెకన్లలో రేస్‌ పూర్తి చేసిన నార్మన్‌ మొదటిసారి స్వర్ణ పతకాన్ని సగర్వంగా అందుకున్నాడు. కిరని జేమ్స్‌ (గ్రెనడా, 44.48సె.) రజతం, మాథ్యూ హడ్సన్‌ (బ్రిటన్‌, 44.66సె.) కాంస్యం నెగ్గారు. మహిళల 400 మీ.లో షానె మిల్లర్‌ (బహ్రెయిన్‌, 49.11సె.) స్వర్ణం, పాలినో (డొమినిక్‌ రిపబ్లిక్‌, రజతం), సదా విలియమ్స్‌ (బార్బడోస్‌, 49.75సె.) కాంస్య పతకం చేజిక్కించుకున్నారు. 


తొలి టైటిల్‌ గార్సియాదే..

ప్రపంచ అథ్లెటిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల 35 కి.మీ. నడకలో పెరూకు చెందిన కింబర్లీ గార్సియా పసిడి పతకం అందుకుంది. రెండు గంటల 39ని16సె.లో రేస్‌ను పూర్తి చేసిన ఆమె టైటిల్‌ దక్కించుకుంది. మహిళల 20 కి.మీ. నడకలోనూ గార్సియా స్వర్ణం సాధించడం విశేషం. ఇక కాటరినా (పోలెండ్‌, 2:40.03) రజతం, క్వియాంగ్‌ (చైనా, 2:40.37) కాంస్య పతకం కైవసం చేసతుకున్నారు. 


ఫెలిక్స్‌ రిటైర్మెంట్‌ వాయిదా..

అమెరికా ట్రాక్‌, ఫీల్డ్‌ దిగ్గజం అథ్లెట్‌ అలీసన్‌ ఫెలిక్స్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దాంతో మహిళల 4గీ400 మీ. రిలే హీట్స్‌ బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. గతవారం 4గీ400 మీ. మిక్స్‌డ్‌ రిలే కాంస్య గెలిచిన అమెరికా జట్టు సభ్యురాలైన 36 ఏళ్ల ఫెలిక్స్‌..ఆ రేస్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-07-24T09:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising