పేరుకే అమెరికా.. అంతా మనోళ్లే!
ABN, First Publish Date - 2022-12-16T00:15:51+05:30
మొట్టమొదటి మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో మొదలవనుంది. ఈ మెగా టోర్నీలో 16జట్లు బరిలో దిగుతున్నాయి.
న్యూఢిల్లీ: మొట్టమొదటి మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో మొదలవనుంది. ఈ మెగా టోర్నీలో 16జట్లు బరిలో దిగుతున్నాయి. 11 జట్లు ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న దేశాలు కాగా.. మిగతా ఐదింటిని ఐసీసీ రీజియన్స్ నుంచి ఎంపికచేశారు. ఇందులో అమెరికా (యూఎ్సఏ) జట్టు కూడా ఒకటి. ఆ మెగా టోర్నీలో తలపడే అమెరికా జట్టును గురువారం ప్రకటించారు. అయితే, జట్టుకు ఎంపికైన మొత్తం 15 మంది సభ్యులు భారత మూలాలున్నవారే కావడం విశేషం. వీరిలో ముగ్గురు తెలుగమ్మాయిలు (గీత కొడాలి, భూమిక భద్రిరాజు, లాస్య ముళ్లపూడి) ఉన్నారు. ఇక, రిజర్వ్ కేటగిరికి ఎంపికైన ఐదుగురిలో ముగ్గురు భారత క్రీడాకారిణులే. తెలు గమ్మాయి గీత జట్టు కెప్టెన్గా వ్యవహరించనుంది. దీంతో ఈ జట్టును ‘ఇండియా బి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
ఇదీ అమెరికా జట్టు: గీత కొడాలి (కెప్టెన్), అనిక (వైస్ కెప్టెన్), అదితి, భూమిక భద్రిరాజు, దిశ, ఇసానీ వాఘేలా, జీవనా అరస్, లాస్య ముళ్లపూడి, పూజ, రీతూ, సాయి తన్మయి, స్నిగ్ధా పాల్, సుహానీ తడని, తరనుమ్ చోప్రా, పూజా షా.
Updated Date - 2022-12-16T00:15:52+05:30 IST