ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గొప్ప రికార్డులు నమోదు చేసిన అలిస్సా హీలీ

ABN, First Publish Date - 2022-04-03T21:52:50+05:30

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ అలిస్సా హీలీ రెండు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రైస్ట్‌చర్చ్: ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ అలిస్సా హీలీ రెండు అతిపెద్ద రికార్డులను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 138 బంతులు ఎదుర్కొని 26 ఫోర్లతో 170 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన హీలీ.. మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కింది.


ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియాకే చెందిన కరేన్ రాల్టన్ పేరున ఉండేది. 2005 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాల్టన్ 107 పరుగులు చేసింది. 17 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును హీలీ బద్దలుగొట్టింది. ప్రపంచకప్ సింగిల్  ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికే హీలీ పేరున ఉంది. ఆమె టీమ్మేట్ రేచల్ హేన్స్ ఈ జాబితాలో 497 పరుగులతో రెండో స్థానంలో ఉంది. 


ఇప్పుడు హీలీ పేరున మరో రికార్డు నమోదైంది. ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో 500కుపైగా పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గానూ తన పేరును రికార్డు పుస్తకాల్లో రాయించుకుంది. ఈ ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో హీలీ సెంచరీ నమోదు చేసింది. ఫైనల్‌లో నేడు ఇంగ్లండ్‌పై భారీ శతకాన్ని నమోదు చేసింది. అలాగే, రెండు అర్ధ సెంచరీలు కూడా చేసింది.  

Updated Date - 2022-04-03T21:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising