ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచింత.. స్వర్ణ పులకింత..

ABN, First Publish Date - 2022-08-02T09:09:49+05:30

మరో వెయిట్‌లిఫ్టర్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఖాతాలో ముచ్చటగా మూడో స్వర్ణాన్ని చేర్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో పసిడి అందించిన లిఫ్టర్‌

బర్మింగ్‌హామ్‌: మరో వెయిట్‌లిఫ్టర్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఖాతాలో ముచ్చటగా మూడో స్వర్ణాన్ని చేర్చాడు. పురుషుల 73కి. విభాగంలో బెంగాల్‌ లిఫ్టర్‌ అచింత షూలీ స్నాచ్‌లో 143కి., క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 170 కేజీలతో మొత్తం 313 కిలోలు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు స్నాచ్‌, టోటల్‌లో అతడు కామన్వెల్త్‌ క్రీడల రికార్డులు నెలకొల్పాడు. అచింతకు గట్టిపోటీ ఇచ్చిన హిదాయత్‌ మహ్మద్‌ (మలేసియా, 138+165కి.) మొత్తం 303 కి.తో రజతం, కెనడాకు చెందిన డర్‌ సిగ్నీ (135+163కి.) మొత్తం 298 కి.తో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. జూ.వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప రజత పతక విజేత షూలీ..స్నాచ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా వరుసగా 137, 140, 143 కి. ఎత్తి అబ్బురపరిచాడు. ఈనేపథ్యంలో 143కి.తో స్నాచ్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ కొత్త రికార్డు భారత లిఫ్టర్‌ సృష్టించాడు. అలాగే ఈ కేటగిరిలో తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డునూ అతడు నమోదు చేశాడు. 81 కి.లలో అజయ్‌ సింగ్‌ (143+176కి.)319 కేజీలు నాలుగో స్థానంలో నిలిచాడు. 


పతకానికి బౌట్‌ దూరంలో హుసాముద్దీన్‌:

తెలుగు బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో మరో పతకానికి ఒక్క బౌట్‌ దూరంలో నిలిచాడు. ఫెదర్‌వెయిట్‌ రౌండ్‌-16లో 5-0తో మహ్మద్‌ సలీం (బంగ్లాదేశ్‌)ను చిత్తు చేసిన హుసాముద్దీన్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ట్రెగెయిన్‌ మార్నింగ్‌ (నమీబియా)తో క్వార్టర్‌ఫైనల్లో అతడు అమీతుమీ తేల్చుకుంటాడు. సెమీ్‌సకు చేరితే కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఫ్లయ్‌ వెయిట్‌ రౌండ్‌-16 ప్రత్యర్థి నమ్రి బెర్రి (వనౌటు)ని చిత్తుచేసిన అమిత్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయాడు.  

Updated Date - 2022-08-02T09:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising