ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛెత్రికి ఫిఫా గౌరవం

ABN, First Publish Date - 2022-09-29T10:39:20+05:30

భారత సాకర్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రిని ప్రపంచ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిఫా) సముచితంగా గౌరవించింది. 38 ఏళ్ల ఛెత్రి సాకర్‌, వ్యక్తిగత జీవిత విశేషాలతో మూడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత స్టార్‌పై డాక్యుమెంటరీ 


న్యూఢిల్లీ: భారత సాకర్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రిని ప్రపంచ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిఫా) సముచితంగా గౌరవించింది. 38 ఏళ్ల ఛెత్రి సాకర్‌, వ్యక్తిగత జీవిత విశేషాలతో మూడు ఎపిసోడ్‌ల డాక్యుమెంటరీ రూపొందించింది. ఆటగాడిగా సునీల్‌ నైపుణ్యాలు, అతడు సాధించిన విజయాలను ఇందులో పొందుపరిచారు. ఫిఫా+ ప్లాట్‌ఫామ్‌లో దీనిని అందుబాటులో ఉంచింది. ‘మీకు రొనాల్డో, మెస్సీ గురించి తెలుసు. కానీ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో మూడో ప్లేయర్‌, భారత జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి విజయగాథను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆ డాక్యుమెంటరీలో ఫిఫా పేర్కొంది. ప్రస్తుతం సాకర్‌ ఆడుతున్న వారిలో రొనాల్డో (117), మెస్సీ (90) తర్వాత ఛెత్రి (84) అత్యధిక గోల్స్‌ చేసిన వారి జాబితాలో మూడో స్థానంలో ఉండడం విశేషం. 

Updated Date - 2022-09-29T10:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising