ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RCB vs LSG: RCBకి ప్రాణం పోసిన పటిదార్.. లక్నో ముందు భారీ లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-26T03:33:17+05:30

ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు యువ ఆటగాడు రజత్ పటిదార్ ప్రాణం పోశాడు. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ విఫలమైనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కత్తా: ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు యువ ఆటగాడు రజత్ పటిదార్ ప్రాణం పోశాడు. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ విఫలమైనా పటిదార్ మాత్రం దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. దీంతో.. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లక్నో జట్టు ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పటిదార్‌కు దినేష్ కార్తీక్ కూడా తోడవడంతో ఆర్‌సీబీ చివరి 30 బంతుల్లో పరుగుల వరద పారించింది.



చివరి 30 బంతుల్లో 84 పరుగులు చేసిందంటే ఏ రేంజ్‌లో డీకే, పటిదార్ బ్యాట్లకు పనిచెప్పారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20వ ఓవర్‌లో మాత్రం అవీష్ ఖాన్ కట్టడి చేశాడు. దీంతో.. 20వ ఓవర్‌లో 13 పరుగులు మాత్రమే వచ్చాయి. రజత్ పటిదార్ 54 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఏడు సిక్స్‌లు, 12 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డీకే కూడా 23 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ నాటౌట్‌గా నిలిచి జట్టుకు మంచి స్కోర్‌ను అందించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు Faf du Plessis డకౌట్ ఊహించని షాకిచ్చింది.



కోహ్లీ 25 పరుగులు, మ్యాక్స్‌వెల్ 9 పరుగులకే చేతులెత్తేయడంతో ఆర్‌సీబీ ఎక్కువ స్కోర్ చేయకపోవచ్చని అభిమానులు భావించారు. కానీ.. ఊహించని విధంగా పటిదార్ 112 పరుగులతో సెంచరీతో రాణించి ఆర్‌సీబీకి ఊపిరి పోశాడు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చమీరా బౌలింగ్‌లో పరుగులను బెంగళూరు బ్యాట్స్‌మెన్స్ పిండుకున్నారు. చమీరా బౌలింగ్ చేసిన నాలుగు ఓవర్లలో 54 పరుగులు వచ్చాయి. క్రూనల్ పాండ్యా నాలుగు ఓవర్లలో 39 పరుగులు, అవీష్ ఖాన్ బౌలింగ్‌లో 44 పరుగులు, రవి బిష్ణోయి బౌలింగ్‌లో 45 పరుగులను బెంగళూరు రాబట్టగలిగింది. మొహ్సిన్ ఖాన్, క్రూనల్ పాండ్యా, అవీష్ ఖాన్, రవి బిష్ణోయికి తలో వికెట్ దక్కింది.

Updated Date - 2022-05-26T03:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising