ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుషుల రిలేలో ఫైనల్‌కు..

ABN, First Publish Date - 2022-08-06T10:03:26+05:30

అథ్లెటిక్స్‌లో భారత పురుషుల రిలే జట్టు పతకం సాధించే దిశగా ముందంజ వేసింది. 4్ఠ400 మీ. రిలే హీట్‌-2లో అనాస్‌, నిర్మల్‌, అజ్మల్‌, అమోజ్‌లతో కూడిన భారత జట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అథ్లెటిక్స్‌  

100 మీ. హర్డిల్స్‌లో జ్యోతికి నిరాశ

అథ్లెటిక్స్‌లో భారత పురుషుల రిలే జట్టు పతకం సాధించే దిశగా ముందంజ వేసింది. 4్ఠ400 మీ. రిలే హీట్‌-2లో అనాస్‌, నిర్మల్‌, అజ్మల్‌, అమోజ్‌లతో కూడిన భారత జట్టు 3:06.97 సెకన్లలో రేసు ముగించి రెండోస్థానంలో నిలిచింది. దీంతో రెండు హీట్స్‌లో కలిపి ఓవరాల్‌గా ఆరోస్థానంలో నిలిచి భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది. ఇక.. 100 మీటర్ల హర్డిల్స్‌లో  తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ హీట్స్‌లోనే వెనుదిరిగింది. హీట్‌-2లో పరిగెత్తిన జ్యోతి 13.18 సెకన్ల టైమింగ్‌తో నాలుగోస్థానానికి పరిమితమైంది. ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచి సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. 22 ఏళ్ల జ్యోతి.. ఈ ఏడాది తన జాతీయ రికార్డు ప్రదర్శన 13.04 సె. కంటే తక్కువ టైమింగ్‌ను హీట్స్‌లో నమోదుచేయడం గమనార్హం.


బ్యాడ్మింటన్‌

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

కామన్వెల్త్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం దక్కించుకున్న భారత షట్లర్లు వ్యక్తిగత విభాగాల్లోనూ అదరగొడుతున్నారు. సింగిల్స్‌లో పీవీ సింధు 21-10, 21-9తో హుసినా (ఉగాండ)పై, కిడాంబి శ్రీకాంత్‌ 21-9, 21-12తో దుమిందు అబెవిక్రమ (శ్రీలంక)పై, పురుషుల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌/ట్రీసా జోడీ 21-2, 21-4తో జెమిమా/ముంగ్రా (మారిషస్‌) జంటపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 


టీటీ

క్వార్టర్స్‌లో శ్రీజ, మనిక

టేబుల్‌ టెన్ని్‌సలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, మనికా బాత్రా సింగిల్స్‌లో క్వార్టర్స్‌ చేరారు. ప్రీక్వార్టర్స్‌లో మనిక 4-0తో జీ మిన్‌యంగ్‌ (ఆస్ట్రేలియా)పై, హోరాహోరీ పోరులో శ్రీజ 5-2తో చార్లెట్‌ కేరీ (వేల్స్‌)పై నెగ్గారు. కాగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీజ/శరత్‌ కమల్‌, మనిక/సాథియాన్‌ జోడీలు ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించారు. ఇక.. పురుషుల డబుల్స్‌లో శరత్‌ కమల్‌/జ్ఞానశేఖరన్‌, హర్మీత్‌/సానిల్‌ జంటలు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి.  

Updated Date - 2022-08-06T10:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising