ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్యోతి కొత్త చరిత్ర

ABN, First Publish Date - 2022-10-18T10:10:20+05:30

తెలుగు అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. మహిళల 100 మీ. హర్డిల్స్‌ను ఆమె 13 సెకన్లలోపే పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

13 సెకన్లలోపే 100 మీ. హర్డిల్స్‌ను పూర్తి చేసిన తెలుగమ్మాయి

బెంగళూరు: తెలుగు అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. మహిళల 100 మీ. హర్డిల్స్‌ను ఆమె 13 సెకన్లలోపే పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించిన జ్యోతి 12.82 సె.లలో రేస్‌ పూర్తి చేసి తన జాతీయ రికార్డును తానే తిరగరాసింది. రేస్‌ జరిగిన సమయంలో గాలి వేగం (0.9మీ./సె.) నిబంధనల మేరకే ఉండడంతో జ్యోతి జాతీయ రికార్డుకు అవరోధం లేకుండా పోయింది.


ఇటీవల గాంధీనగర్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో 12.79 సె. రేస్‌ను పూర్తి చేసి ఆమె విజేతగా నిలిచింది. కానీ అప్పుడు గాలి వేగం నిబంధనల మేరకు లేకపోవడం గమనార్హం. ఇక జ్యోతి గత జాతీయ రికార్డు 13.04 సె.ను గత మేలో నమోదు చేసింది. సోమవారంనాడు..హీట్స్‌లోనే 13.38 సె.లతో మీట్‌ రికార్డును ఈ విశాఖ యువతి నెలకొల్పింది. దాంతో 20 ఏళ్ల కిందట చెన్నైలో అనురాధ బిశ్వాల్‌ (13.38 సె.) నమోదు చేసిన మీట్‌ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. సప్నా కుమారి (జార్ఖండ్‌, 13.26 సె) రెండోస్థానంతో రజతం గెలుచుకోగా, తెలంగాణకు చెందిన నందిని అగసర (13.51 సెకన్లు) మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది.

Updated Date - 2022-10-18T10:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising