ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LED Tv Blast: బాంబులా పేలిన ఎల్‌ఈడీ టీవీ.. బాలుడి మృతి!

ABN, First Publish Date - 2022-10-05T22:47:24+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఊహించని ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎల్‌ఈడీ టీవీ పేలిపోవడంతో ఒకరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఊహించని ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎల్‌ఈడీ టీవీ పేలిపోవడంతో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇంటి గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. టీవీ పేలి ఇంత విధ్వంసం జరిగిందని తెలుసుకున్న అందరూ ఆందోళనకు గురవుతున్నారు. భారి శబ్దాలు విని ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఉంటుందని చుట్టుపక్కల వారు భావించారు. ఇంట్లోకి వచ్చి చూసే సరికి విషయం అర్థమయింది. 


ఇది కూడా చదవండి..

విషం ఇచ్చి భర్తను చంపిన భార్య.. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని నివ్వెరపోయిన పోలీసులు..!


పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. టీవీకి సంబంధించిన పార్ట్‌లు బాధితుల శరీరాల్లోకి చొచ్చుకుపోయాయి. టీవీని తగిలించిన గోడ పూర్తిగా ధ్వంసమైంది. గోడ అవతల గదిలో ఉన్న 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆ ఇంట్లో ఉన్న మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఆ ఇంటి స్లాబ్ కూడా డ్యామేజ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆ ఇంట్లో పేలుడు పదార్థాలు ఏవీ కనిపించలేదని, అనుమానించాల్సిన వస్తువులు ఏవీ అక్కడ లేనవి పోలీసులు చెబుతున్నారు. 


హై ఓల్టేజ్ కారణంగానే ఎల్‌ఈడీ టీవీ పేలి పోయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. గత 18 ఏళ్లుగా ఎల్‌ఈడీ టీవీలు అమ్ముతున్నానని, టీవీ పేలి ఈ స్థాయిలో విధ్వంసం జరగడం తానెప్పుడూ చూడలేదని దుకాణం యజమాని చెప్పాడు. హై ఓల్టేజ్ విద్యుత్ కారణంగా స్క్రీన్ కరిగిపోతుందని, అంతే తప్ప పేలిపోవడం జరగదని అన్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-10-05T22:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising