ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌లో అందమైన యువతి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేసిన 40 ఏళ్ల వ్యక్తి.. చివరకు అతని పరిస్థితి ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-04-21T09:00:15+05:30

అతని వయసు 40 ఏళ్లు.. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.. అతనికి కొద్ది రోజుల క్రితం ఓ అందమైన యువతి నుంచి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అతను క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓకే చేశాడు. ఆమెతో ఛాటింగ్ చేశాడు.. ఫోన్ నెంబర్లు మార్చుకుని మాటలు కలిపాడు.. ఆమెకు వీడియో కాల్స్ కూడా చేసేవాడు. మొదట్లో అతను ఎంతగానో ఆనందపడ్డాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతని వయసు 40 ఏళ్లు.. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.. అతనికి కొద్ది రోజుల క్రితం ఓ అందమైన యువతి నుంచి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అతను క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓకే చేశాడు. ఆమెతో ఛాటింగ్ చేశాడు.. ఫోన్ నెంబర్లు మార్చుకుని మాటలు కలిపాడు.. ఆమెకు వీడియో కాల్స్ కూడా చేసేవాడు. మొదట్లో అతను ఎంతగానో ఆనందపడ్డాడు. అయితే ఆ అమ్మాయి తన నిజస్వరూపం బయటపెట్టడంతో షాకై ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. 


వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు సమీపంలో ధరంపూర్ గ్రామానికి చెందిన సంతోష్‌కు ఓ యువతి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. అమ్మాయి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉండడంతో సంతోష్ వెంటనే యాక్సెప్ట్ చేసేశాడు. ఇద్దరూ మొదట ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చాట్ చేసుకున్నారు. తర్వాతి రోజు నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి సంతోష్‌కి వీడియో కాల్ చేసింది. 40 ఏళ్ల సంతోష్‌ ఎంతో సంతోషంగా ఆ యువతితో మాట్లాడాడు. 


అలా మూడు రోజులు గడిచిన తర్వాత సంతోష్‌కు ఆ యువతి షాకిచ్చింది. సంతోష్‌కు అతని న్యూడ్ వీడియోనే పంపి రూ.15 వేలు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ వీడియో వైరల్ చేస్తానని బెదిరించింది. దీంతో భయపడిన సంతోష్ డబ్బు చెల్లించాడు. అయితే మరోసారి ఆ యువతి డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన సంతోష్ ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2022-04-21T09:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising