ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిగాలుగా ఉంటున్న 13 ఏళ్ల కూతురు.. ఏమైందని అడిగితే ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన తల్లి.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-01-31T19:23:58+05:30

ఆ యువకుడిని ఆ బాలిక అన్నయ్యలా భావించింది.. ప్రతి ఏడాదీ రాఖీ కూడా కట్టేది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడిని ఆ బాలిక అన్నయ్యలా భావించింది.. ప్రతి ఏడాదీ రాఖీ కూడా కట్టేది.. ఆ బాలిక తల్లిదండ్రులు కూడా ఆ యువకుడిని స్వంత మనిషిలా చూసుకున్నారు.. అదే అదునుగా భావించిన ఆ యువకుడు ఆ బాలికపై కన్నేశాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను లోబర్చుకున్నాడు.. మ్యాగీలో మత్తు మందు కలిపి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.. హర్యానాలోని హిసార్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


హిసార్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక తన పక్కింట్లో ఉండే మనోహర్ అనే వ్యక్తితో చిన్నప్పటి నుంచి సన్నిహితంగా ఉండేది. ఎనిమిదేళ్లుగా అతడికి రాఖీ కడుతూ `అన్నయ్యా` అని పిలిచేది. అయితే మనోహార్ మాత్రం ఆమెను చెల్లెలిగా భావించలేదు. అవకాశం వస్తే శారీరక వాంఛ తీర్చుకునేందుకు ఎదురు చూశాడు. సోమవారం ఆ బాలిక ఇంట్లోని వారు బయటకు వెళ్లారు. ఆ సమయంలో మనోహర్ తన ఇంట్లో మ్యాగీ న్యూడిల్స్ చేశాడు. 


దాంట్లో మత్తు మందు కలిపి బాలిక చేత తినిపించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బాలికను బెదిరించాడు. భయపడిన బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు.


వారం రోజులుగా కూతురు ముభావంగా ఉండడాన్ని తల్లి కనిపెట్టింది. విషయం ఏంటని అడగ్గా.. ఆ బాలిక ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మనోహర్‌పై అత్యాచారం కేసు పెట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్‌ను అదుపు లోకి తీసుకున్నారు.

Updated Date - 2022-01-31T19:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising