ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అమ్మ బాబోయ్.. అలా ఎలా పడ్డావ్ నాయనా.. మీ అన్న దేవుడే..!

ABN, First Publish Date - 2022-08-05T02:38:33+05:30

ఇంటర్నెట్ (Internet) అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా మన స్మార్ట్‌‌ఫోన్‌లో (Smartphone) ఆ ఘటన క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. సోషల్ మీడియాలో (Social Media) ఆ వీడియో వైరల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ (Internet) అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా మన స్మార్ట్‌‌ఫోన్‌లో (Smartphone) ఆ ఘటన క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. సోషల్ మీడియాలో (Social Media) ఆ వీడియో వైరల్ (Viral Video) అవ్వడం, ఆ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడించడం పరిపాటిగా మారింది. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు ఒక్క క్షణం ‘అమ్మ బాబోయ్’ అనిపిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఇది. కేరళలోని మలప్పురం (Malappuram) పరిధిలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌లో (CCTV Footage) రికార్డయిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఘటన జులై 31నే జరిగినప్పటికీ వీడియో మాత్రం తాజాగా వైరల్ (Viral) అవుతోంది.



ఆ వీడియోలో ఏముందంటే.. మలప్పురంలోని ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న అన్నయ్య ఆరు బయట నిలబడి Hose సాయంతో టెర్రాస్ మీదకు నీళ్లను స్ప్రే చేస్తున్నాడు. టెర్రాస్‌పైన ఉన్న అతని తమ్ముడు కాలు జారి పడిపోయాడో ఏమో తెలియదు గానీ ఉన్నట్టుండి పై నుంచి కిందపడిపోయాడు. అతను కిందపడటాన్ని గమనించిన అన్నయ్య అతనిని గాలిలోనే పట్టుకునేందుకు చేతులు చాచి ప్రయత్నం చేశాడు. చిన్నారులనైతే అలా పట్టుకుని కాపాడే అవకాశం ఉంటుంది. కానీ.. అతని తమ్ముడు కూడా యువకుడు కావడంతో అతను నేరుగా అన్నయ్య మీద పడిపోయాడు.



అయితే.. అదృష్టవశాత్తూ తమ్ముడి తల నేరుగా నేలను తాకకుండా అన్నయ్య కాపాడగలిగాడు. దీంతో.. ఆ తమ్ముడికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ.. యువకుడైన తమ్ముడు మీద పడటంతో అదుపు తప్పి అన్నయ్య కిందపడిపోయాడు. కిందపడిన అన్నయ్య మీద తమ్ముడి పడ్డాడు. దీంతో.. ఆ అన్నయ్య కొంత సమయానికి గానీ కోలుకోలేకపోయాడు. కొంత సమయానికి అన్నయ్య కూడా పైకి లేచి వెళ్లిపోయాడు. గత ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజీలను చూస్తే స్పష్టమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. టెర్రాస్‌పై ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ఇలాంటి ఘటనల్లో నేరుగా తల నేలకు తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-08-05T02:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising