ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-07-02T01:32:42+05:30

కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే సమయంలో అదృష్టవశాత్తు కొందరు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడుతుంటారు. వీడికి భూమ్మీద నూకలు ఉన్నట్టున్నాయ్.. అని ఇలాంటి సందర్భాల్లోనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే సమయంలో అదృష్టవశాత్తు కొందరు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడుతుంటారు. వీడికి భూమ్మీద నూకలు ఉన్నట్టున్నాయ్.. అని ఇలాంటి సందర్భాల్లోనే అంటూ ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు కూడా అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. అయితే బతుకు జీవుడా అని అక్కడి నుంచి వెళ్లకుండా.. నడి రోడ్డుపై యోగాసనాలు వేస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వీడికేమైనా పిచ్చా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. వాహనాల రాకపోకలతో ఓ రహదారి రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ఓ యువకుడు వాహనాలను గమనించకుండా.. బైక్‪‌పై రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తాడు. రోడ్డు మధ్యలోకి రాగానే వేగంగా వచ్చిన ఓ కారు.. బైకుని బలంగా ఢీకొంటుంది. ఈ ప్రమాదంలో యువకుడు ఎగిరి దూరంగా పడతాడు. అయితే తలకు హెల్మెట్ ఉండడంతో ఎలాంటి గాయాలు కాకుండా బయటపడతాడు. బైకు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇదిలావుండగా, అక్కడి నుంచి పక్కకు వెళ్లాల్సిన యువకుడు.. విచిత్రంగా రోడ్డుపైనే అటూ ఇటూ తిరుగుతూ ఆసనాలు వేయడాన్ని చూసి వాహనదారులు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడికేమైనా పిచ్చా.. అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఆనందంతో అలా ఆసనాలు వేస్తున్నాడు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మూడు ఫైర్ కొరడాలను.. కళ్లు చెదిరేలా గింగిరాలు కొట్టించి.. ప్రపంచ రికార్డు కొట్టిన ఘనుడు.. చూస్తే ఆశ్చర్యపోతారు..





Updated Date - 2022-07-02T01:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising