ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరి చివర బావిలోంచి తీవ్ర దుర్వాసన.. ఏంటా అని అనుమానంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు లోపలికి తొంగి చూస్తే..

ABN, First Publish Date - 2022-07-30T20:08:31+05:30

ఆ ఊరి చివర ఓ బావి ఉంది. ఆ బావి పక్క నుంచి వెళ్తున్న గ్రామస్థులు.. అందులోంచి దుర్వాసన రావడాన్ని గుర్తించారు. తొలుత ఆ విషయాన్ని ప్రజలు లైట్ తీసుకున్నారు. కానీ వాసన భరించరానంతగా రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బావి వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఊరి చివర ఓ బావి ఉంది. ఆ బావి పక్క నుంచి వెళ్తున్న గ్రామస్థులు.. అందులోంచి దుర్వాసన రావడాన్ని గుర్తించారు. తొలుత ఆ విషయాన్ని ప్రజలు లైట్ తీసుకున్నారు. కానీ వాసన భరించరానంతగా రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో బావిలో కనిపించిన దృశ్యం చూసి స్థానికులు కంగుతిన్నారు. ఇంతకూ ఆ గ్రామ ప్రజలు బావిలో ఏం చూశారు? ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లో(Rajasthan)ని సికార్ జిల్లాలో గల భాగేగా గ్రామం ( Bhagega village) చివర ఓ బావి ఉంది. దాని పక్కనే దారి కూడా ఉండటంతో గ్రామ ప్రజలు ఆ బావి దగ్గర నుంచే రోజూ పొలం పనులకు వెళ్తూ ఉంటారు. ఇలా ఎప్పటిలాగే పొలం పనులకు వెళ్లే ప్రజలు.. కొద్ది రోజులుగా అందులోంచి దుర్వాసన(Bad Smell) రావడాన్ని గుర్తించారు. అయితే ఆ విషయాన్ని మొదట్లో వాళ్లు అంతగా పట్టించుకోలేదు. రోజులు గడిచే కొద్దీ దుర్వాసన తీవ్రం అవడంతో అనుమానం వ్యక్తం చేశారు. బావిలో ఏముందని తొంగి చూశారు. ఈ క్రమంలో వారికి బావిలో శవం(Dead Body) కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన గ్రామ ప్రజలు.. పోలీసులకు(Police) సమాచారం ఇచ్చారు. 



వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. స్థానికులతో కలిసి మృతదేహాన్ని బావిలోంచి(well) బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. 3-4 గంటలు తీవ్ర శ్రమించి.. చేతులెత్తేశారు. అనంతరం స్థానిక డిఫెన్స్ టీం సహాయాన్ని కోరారు. దీంతో రంగంలోకి దిగిన డిఫెన్స్ టీం.. మృతదేహాన్ని బయటకు తీసింది. ఈ క్రమంలో అధికారులు డెడ్ బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. శవం పూర్తిగా కుళ్లిపోవడం వల్ల చనిపోయింది ఎవరనేది గర్తించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. చనిపోయింది ఎవరు? మృతదేహం బావిలోకి ఎలా వచ్చింది? ఎవరైనా హత్య చేసి శవాన్ని బావిలో పడేసి ఉంటారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2022-07-30T20:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising