ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా భార్య చాలా అందమైనది, తెలివైనది.. కాపురానికి రావడం లేదు.. నచ్చ చెప్పమంటూ జిల్లా ఎస్పీకి యువకుడి లేఖ!

ABN, First Publish Date - 2022-02-18T20:22:01+05:30

తన కంటే అందమైన, తెలివైన యువతిని వివాహం చేసుకుని అష్టకష్టాలు పడుతున్నాడు ఓ యువకుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన కంటే అందమైన, తెలివైన యువతిని వివాహం చేసుకుని అష్టకష్టాలు పడుతున్నాడు ఓ యువకుడు. భార్య తనను తృణీకరించడంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యకు ఎలాగైనా నచ్చ చెప్పి తన దగ్గరకు పంపించాల్సిందిగా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ఛత్తార్‌పూర్‌కు చెందిన నందు పాల్ గతేడాది ఏప్రిల్ 30న రీనా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 


వివాహం తర్వాత ఆమె కేవలం మూడ్రోజులు మాత్రమే అత్తింట్లో ఉండి ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన నందుకు షాకింగ్ అనుభవం ఎదురైంది. అత్తమామలు అతడిని ఇంట్లోకి కూడా రానివ్వలేదు. అతడితో మాట్లాడేందుకు కూడా రీనా ఇష్టపడలేదు. భార్యను కాపురానికి పంపమని నందు అత్తమామలను ఎంతగానో వేడుకున్నాడు. అయినా ఫలితం లేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


`నా భార్య చాలా అందంగా ఉంటుంది. బాగా చదువుకుంది. చాలా తెలివైనది. అన్నింట్లోనూ నా కంటే ఉన్నతంగా ఉంటుంది. అయితే పెళ్లి చేసుకుని కాపురానికి మాత్రం రావడం లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను. దయచేసి ఆమె నా ఇంటికి వచ్చేలా చెయ్యండ`ని జిల్లా ఎస్పీకి నందు ఓ లేఖ రాశాడు. 

Updated Date - 2022-02-18T20:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising