ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవి ప్రపంచంలోని 7 అత్యంత రద్దీ నగరాలు.. ట్రాఫిక్ జామ్ అయ్యందంటే..

ABN, First Publish Date - 2022-02-27T16:37:00+05:30

ప్రపంచంలోని అత్యంత ట్రాఫిక్ ఉండే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని అత్యంత ట్రాఫిక్ ఉండే నగరాల్లో భారతదేశంలోని పలు నగరాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఈ నగరాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా లక్షలాది ప్రజల సమయం వృథాగా మారుతోంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలునగరాల్లోని ట్రాఫిక్ స్థితిగతుల నివేదికను టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ విడుదల చేస్తుంటుంది. దీనిలో ఆయా నగరాల్లోని ట్రాఫిక్ రద్దీ ప్రకారం నగరాల ర్యాంకింగ్ ఇస్తారు. 2021 సంవత్సరానికి విడుదల చేసిన సూచికలో (టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2021), ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాలకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్- 2021 ప్రకారం ఇస్తాంబుల్‌లోని టర్కిష్ నగరం అత్యంత రద్దీగా ఉండే నగరం. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రతి సంవత్సరం 142 గంటల నష్టం జరుగుతోంది. ఈ జాబితాలో రష్యా రాజధాని మాస్కో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రతి సంవత్సరం 140 గంటలు వృథా అవుతున్నాయి. దీని తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు మూడవ స్థానం దక్కింది.  


ఇక్కడ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రతి సంవత్సరం 128 గంటలు వృథా అవుతున్నాయి. నాలుగో స్థానంలో కొలంబియాకు చెందిన బొగోటా నిలిచింది. ఇక్కడ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రతి సంవత్సరం 126 గంటలు వృథా అవుతున్నాయి. ఈ జాబితాలో ముంబై పేరు ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ జామ్ కారణంగా ప్రతి సంవత్సరం 121 గంటలు వృథా అవుతున్నాయి. 2020లో ముంబై ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండవ నగరంగా ఉండేది. అయితే 2021 నాటికి ముంబైలో ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడి 5వ స్థానానికి చేరుకుంది. ముంబైతో పాటు, భారతదేశంలోని అనేక ఇతర నగరాల పేర్లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిలో బెంగళూరు 10వ స్థానంలో, న్యూఢిల్లీ 11వ స్థానంలో, పూణే 21వ స్థానంలో ఉన్నాయి. రద్దీగా ఉండే నగరాల్లో ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరం పేరు ఆరవ స్థానంలో ఉంది, ఇక్కడ ప్రతి సంవత్సరం జామ్ కారణంగా 117 గంటలు వృథా అవుతున్నాయి. రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ పేరు ఏడవ స్థానంలోకి చేరింది. ఇక్కడ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రతి సంవత్సరం 115 గంటలు వృథా అవుతుంటాయి.

Updated Date - 2022-02-27T16:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising