‘ఇదేందయ్యా ఇది... నేనెప్పుడూ చూడలే... డైనోసార్‌కు పెడతారా ఏందీ?’.. ఆ స్వీట్ చూసి బిత్తరపోతున్న జనం!
ABN, First Publish Date - 2022-12-15T11:30:17+05:30
భారతీయుల మనసులలో స్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంది. స్వీట్ల రుచి చూసేందుకు చాలామంది ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ప్రతి చిన్న సంబరంలోనూ భారతీయులు తీయని వేడుక చేసుకుంటారు.
భారతీయుల మనసులలో స్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంది. స్వీట్ల రుచి చూసేందుకు చాలామంది ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ప్రతి చిన్న సంబరంలోనూ భారతీయులు తీయని వేడుక చేసుకుంటారు. పండుగల సమయంలోనే కాదు.. సరదాగా కూడా స్వీట్లు ఆర్డర్ చేస్తుంటారు. మిఠాయిలన్నింటిలో జిలేబీకి ఎంతో ప్రత్యేకత ఉంది. వివాహమైనా లేదా మరే ఇతర సంబరమైనా జిలేబీ తప్పకుండా కనిపిస్తుంది.
యూపీలోని లక్నోలోని ఓ స్వీట్ షాప్ వినూత్న రీతిలో జిలేబీ తయారు చేసింది. షాప్‌లోని స్వీట్ మేకర్ అతిపెద్ద జిలేబీని తయారుచేశాడు. ఈ జిలేబీని చూసినవారంతా తెగ మురిసిపోతూ ‘ఇదేందయ్యా ఇది... నేనెప్పుడూ చూడలే‘ అంటున్నారు. లక్నోకు చెందిన ఒక ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ 'ఈట్‌విత్‌సిడ్'లో ఈ జిలేబీ వీడియోను షేర్ చేశారు. జిలేబీ పరిమాణం సాధారణం కంటే ఎంతో పెద్దగా ఉంది. చాలా మంది దీనిని 'ప్రపంచంలోనే అతిపెద్ద జిలేబీ' అని అంటున్నారు. రూ. 360 ధరకు లభించే ఈ జిలేబీ ఉదయం 8 నుండి 11 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది. వీడియో చూసిన ఒక ఒక వినియోగదారు "ఇంత పెద్ద జిలేబీని డైనోసార్ మాత్రమే తినగలుగుతుంది" అని సరదాగా కామెంట్ చేశాడు.
Updated Date - 2022-12-15T11:30:19+05:30 IST