ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమె పాదాల సైజు చూస్తే ఎవ‌రికైనా ద‌డ పుట్టాల్సిందే!

ABN, First Publish Date - 2022-11-19T10:18:37+05:30

యునైటెడ్ స్టేట్స్‌లోని మహిళల సగటు షూ సైజు 8.5- 9 అంగుళాల మధ్య ఉంటుంది. అయితే తాన్యా హెర్బర్ట్ అనే మహిళకు ఈ సైజులు చిన్నవి అవుతాయి. టెక్సాస్‌లోని ఒక మహిళ 33.1 సెంటీమీట‌ర్లు అంటే 13.03 అంగుళాల పొడ‌వైన పాదాలు క‌లిగివుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యునైటెడ్ స్టేట్స్‌లోని మహిళల సగటు షూ సైజు 8.5- 9 అంగుళాల మధ్య ఉంటుంది. అయితే తాన్యా హెర్బర్ట్ అనే మహిళకు ఈ సైజులు చిన్నవి అవుతాయి. టెక్సాస్‌లోని ఒక మహిళ 33.1 సెంటీమీట‌ర్లు అంటే 13.03 అంగుళాల పొడ‌వైన పాదాలు క‌లిగివుంది. ఆమె ప్రపంచంలోనే పెద్ద పాదాలు క‌లిగిన మ‌హిళ‌గా రికార్డు సృష్టించింది. ఆమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో న‌మోద‌య్యింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపిన వివ‌రాల ప్రకారం ఆమె ఉన్నత పాఠశాలలో చ‌దువుకుంటున్న‌ప్పుడు ఆమె పాదాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాన్యా హెర్బర్ట్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎదుగుతున్నప్పుడు ఎంతో ఎత్తుగా ఉండాలని కోరుకున్నాన‌ని, త‌న త‌ల్లి 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉండ‌గా, తండ్రి 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నార‌ని తెలిపింది. ఫ‌లితంగానే తాను పొడవుగా ఉన్నాన‌ని తెలిపింది.

తన తల్లిదండ్రులు తనలో చాలా ఆరోగ్యకరమైన ఆత్మగౌరవాన్ని నింపారని, అందుకే పొడుగ్గా ఉండటాన్ని చెడుగా ఎన్న‌డూ భావించడం లేదని చెప్పింది. త‌న హైట్ చూసి, త‌న‌ను ఎవ‌రూ వేధించినట్లు గుర్తు లేద‌ని తెలిపారు. త‌న‌ స్నేహితులు త‌న‌ను చాలా జాగ్రత్తగా చూసుకునేవార‌ని, త‌నను ప్రేమించి ఇష్టపడేవార‌ని తెలిపింది. త‌న‌ పెద్ద పాదాల పరిమాణం కారణంగా, త‌గిన షూ దొర‌క‌ద‌ని ఆమె వాపోయారు. అందుకే త‌న జీవితంలో ఎక్కువ భాగం పురుషుల బూట్లు ధరించించానని తెలిపారు. తాను ఎల్లప్పుడూ టెన్నిస్ బూట్లు, పురుషుల లోఫర్‌లను ధరించేదానినని తెలిపింది. తాను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అతిపెద్ద షూలను కొనుగోలు చేస్తానని తెలిపింది.

Updated Date - 2022-11-19T10:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising