ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సున్నం కొడుతుండగా.. స్టోర్ రూమ్‌లో బయటపడ్డ పాత సంచి మూటలు.. అనుమానం వచ్చి ఒకదాన్ని తెరచి చూడగా...

ABN, First Publish Date - 2022-04-29T13:51:09+05:30

కొన్నిసార్లు ఊహించని విధంగా నిధులు బయటపడుతుంటాయి. ఇంకొన్ని సార్లు చెత్త కుప్పల్లో కూడా నోట్ల కట్టలు బయటపడిన ఘటనలు కూడా చూస్తుంటాం. ఇప్పుడు మనం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు ఊహించని విధంగా నిధులు బయటపడుతుంటాయి. ఇంకొన్ని సార్లు చెత్త కుప్పల్లో కూడా నోట్ల కట్టలు బయటపడిన ఘటనలు కూడా చూస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో కొందరు కూలి వాళ్లు ఓ పెద్ద ఇంట్లో సున్నం కొడుతూ ఉన్నారు. ఓ స్టోర్ రూమ్‌లో సున్నం కొడుతుండగా.. వారికి మూట కట్టి ఉన్న కొన్ని  పాత సంచులు కనపడ్డాయి. పాత సామాన్లు ఏమైనా ఉంటాయేమో అని అంతా అనుకున్నారు. అయితే అనుమానం వచ్చి ఓ సంచి తెరిచి చూసి అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


చెన్నై తిరుప్పూర్‌కు చెందిన దురైస్వామి వృత్తిరీత్యా  పారిశ్రామికవేత్త. నూలు ఉత్పత్తికి సంబంధించిన చాలా మిల్లులను నడుపుతున్నాడు. రెండు నెలల క్రితం ఆయన కుమార్తె వివాహం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికి రంగులు వేసేందుకు కొందరు పనివాళ్లను పిలిపించాడు. వారు ఇంటికి సున్నం కొట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఓ స్టోర్ రూమ్ గదిలో సున్నం కొడుతుండగా.. వారికి మూట కట్టి ఉన్న కొన్ని సంచులు కనిపించాయి. ఏవో పాత సామాన్ల సంచులు అనుకుని ముందుగా పట్టించుకోలేదు. అయితే కొద్ది సేపటి తర్వాత అనుమానం వచ్చి.. వాటిలో ఓ సంచిని తెరచి చూశారు. అందులో నోట్ల కట్టలు ఉండడంతో అంతా అవాక్కయ్యారు. ఇంకేముందీ.. రూ.2.5కోట్లు ఉన్న ఓ సంచిని తీసుకుని, అక్కడి నుంచి ఉడాయించారు.

కూరగాయలు తెస్తానని వెళ్లిన భార్య.. రాత్రైనా రాకపోవడంతో డౌట్.. ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పింది విన్న ఆ భర్తకు..


కూతురి వివాహం అనంతరం ఖర్చులు వివరాలను సరిచూసుకునే క్రమంలో ఇంట్లో నగదు, రూ.75లక్షల విలువైన నగలు మాయమైనట్లు దురైస్వామి గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. విచారణలో భాగంగా సున్నం కొట్టిన కూలీలపై అనుమానం వచ్చి.. తిరువణ్ణామలైకు చెందిన సతీష్, దామోదరన్, శక్తి, నీలగిరికి చెందిన రాధాకృష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చాలా సంచులు ఉండగా.. అందులో ఓ సంచిని మాత్రమే తాము తీసుకెళ్లినట్లు అంగీకరించారు. అయితే నగలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ చోరీ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.

మేడ మీద గాఢనిద్రలో వదిన.. అర్ధరాత్రి గదిలో అన్నను చంపిన తమ్ముడు.. విచారణలో విస్తుపోయే నిజాలు..!

Updated Date - 2022-04-29T13:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising